mythology

64 కళలు అంటారు..అవి ఏమిటో తెలుసా..?

చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్య‌లని కూడా అంటారు. ఈ లెక్కలో కూడా కొన్ని మత భేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు.

వేదం, శాస్త్రం, ధర్మశాస్త్రం (స్మృత్రి), వ్యాకరణం, జ్యోతిశ్శాస్త్రం, ఆయుర్వేదం, సంగీతశాస్త్రం (గాంధర్వం), కవిత్వం, స్వరశాస్త్రం, సాముద్రికశాస్త్రం, కొక్కోకం (కామశాస్త్రం), శకునశాస్త్రం, మల్లయుద్ధవిద్య, గారుడం, వాక్చమత్కృతి, అర్థవేదం, దేశభాషా పాండిత్యం, వివిధ లిపిజ్ఞానం, లేఖనం, రథగమనం, రత్నపరీక్ష, అస్త్రవిద్య, పాకశాస్త్రజ్ఞానం, శిక్ష, వృక్షదోహదాలు, ఆగమశాస్త్రం, ఇంద్రజాలికం (గారడీ), కల్పం, కుట్టుపని, శిల్పశాస్త్రనైపుణ్యం, రసవిద్య (బంగారం చేయటం – రసవాదం), నృపాలనిధి (రాజనీతిశాస్త్రం).. ఇక్క‌డి వ‌ర‌కు మొత్తం 32 క‌ళలు అయ్యాయి. మిగిలిన‌వి చూస్తే..

do you know about 64 arts

అంజనవిశేషాలు (కాటుకలు), వాయుజలస్తంభన, ధ్వనివిశేషం, ఘటికాశుద్ధి, పశురక్షణ, విహంగ భేదాగమన విద్య, చిత్రలేఖనం, అభినయశాస్త్రవిద్య, దొంగతనం, వాస్తుశాస్త్రం, మణిమంత్రౌషధసిద్ధి, లోహకార విద్య, స్వప్న శాస్త్రం, అష్టసిద్ధులు, వడ్రంగం, మూలికౌషదసిద్ధి, చర్మకారక విద్య, గణితశాస్త్రం, సూతికాకృత్యం, కార్యకారణవిద్య, చరాచారాన్యధాకరణం, తంతువిద్య, యోగవిద్య, వ్యవసాయం, ప్రశ్నశాస్త్రం, వ్యాపారం, మిగ్రభేదం, వేట, తుఅరగారోహణవిద్య, అలంకారాలు, ఉచ్చాటనం, నృత్యం వ‌స్తాయి.

వీనిలో కొన్నింటిని తీసివేసి కొందరు.. అదృశ్యవిద్య, ధాతుపరీక్ష, శాంతి, నాటకం, పురాణం, సుషిణ, అనర్ధ, ఘనా అనేవాటిని చేర్చారు.

Admin

Recent Posts