హిందూ మతం…. ఆత్మ మరణం తర్వాత మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం ప్రకారం, మన ప్రస్తుత జీవితంలోని చర్యలు భవిష్యత్ జన్మలను ప్రభావితం చేస్తాయి. మోక్షం పొందడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. బౌద్ధ మతం… ఆత్మ లేదని, కానీ మనస్తత్వం మరొక రూపంలో పునర్జన్మ ఎత్తుతుందని నమ్ముతారు. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అంగీకరిస్తారు. నిర్వాణం చేరుకోవడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. జైన మతం…. పునర్జన్మను గట్టిగా నమ్ముతారు. ఆత్మ అనేక జన్మలు ఎత్తుతుందని, కర్మ ఫలితంగా వివిధ రూపాలలో పుడుతుందని భావిస్తారు.
సిక్కు మతం…. పునర్జన్మను నమ్ముతారు, కానీ దీనిపై అంత ఎక్కువ దృష్టి పెట్టరు. ముక్తి పొందడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి బయటపడవచ్చని భావిస్తారు. క్రైస్తవ మతం మరియు ఇస్లాం…. సాధారణంగా ఒకే జీవితాన్ని నమ్ముతారు, పునర్జన్మను తిరస్కరిస్తారు. మరణానంతరం స్వర్గం లేదా నరకానికి వెళతారని నమ్ముతారు. షింటో మతం….. మరణానంతరం ఆత్మ పితృదేవతలుగా మారతాయని నమ్ముతారు. కొన్ని సందర్భాలలో ఆత్మలు తిరిగి జన్మించవచ్చని భావిస్తారు.
పెరుగుతున్న జనాభా ఎక్కడి నుంచి వస్తుంది ? … ప్రపంచంలో అధిక జనాభా కలిగిన క్రైస్తవ, ఇస్లాం మతాలు పునర్జ్మన్మను తిరస్కరిస్తాయి. కావున వారికి ఈ ప్రశ్న రాదు. 20 శాతం కన్నా తక్కువ మంది ప్రజలే పునర్జన్మను నమ్ముతారు. ఆ నమ్మేవారు మతాన్ని నమ్ముతారు కావున మత తాత్విక చింతన నుంచే దానికి పరిష్కారం దొరుకుతుంది. శాస్త్ర సాంకేతికతల దృష్ట్యా…. పునర్జన్మ ఒట్టి బూటకం. మతాలు వాటి ఉనికి కోసం ఆత్మ, పునర్జన్మల ప్రచారం. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. ఇది గుడ్డినమ్మకం.