వినోదం

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శంకర్ శకం ముగిసింది&period; ఆయన ఇక రెస్ట్ తీసుకోవడం ఉత్తమం&period; అలా చేస్తేనే ఇప్పుడు ఉన్న పేరును కాపాడుకోగలుగుతారు&period; ఆయన ఇంకా రెండు దశాబ్దాల నాటి పద్ధతిలోనే సినిమాలు తీస్తున్నారు&period; శంకర్ సినిమాల్లో ఇంతకన్నా పైత్యపు సినిమా ఇంకోటి లేదు&period; ఈ సినిమా చూసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి&period; RRR తో వచ్చిన పేరును రాం చరణ్ గోదాట్లో కలిపేశాడు&period; రామ్ చరణ్ కు కథల సెలక్షన్ రాదు అని అర్థం అవుతోంది&period; అల్లు అర్జున్ ను చూసి చరణ్ ఈ విషయంలో చాలా నేర్చుకోవాలి&period; ఈ సినిమా లో కొన్ని సీన్లు మాత్రమే చెప్పుకోదగ్గవి ఉన్నాయి&period; కలెక్టర్ గొప్పదనం వివరించే సీన్&comma; డబ్బు లేకుండా రాజకీయం చేయాలనే ఆశయంతో రాం చరణ్ తండ్రి పార్టీ పెట్టిన విధానం&comma; పదవీ కాంక్ష లేకుండా ఒక సామాన్య కార్యకర్తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం&comma; శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా ఉన్న వేదిక పై గొడవ జరిగినపుడు కలక్టర్ కు మంత్రి చేత క్షమాపణ చెప్పించడం ఇలా ఇంకో 3&comma; 4 ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిగతా సినిమా అంతా తలా తోకా లేకుండా&comma; తర్క రహితంగా సాగుతుంది&period; నిజ జీవితంలో జరగడానికి అస్సలు అవకాశం లేని ఎన్నో సంఘటనలు ఇందులో అవలీలగా జరుగుతాయి&period; ఒక కలెక్టర్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అయి ఏకంగా&comma; రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ని ట్రాన్ఫర్ చేస్తాడు&period; EVM లను డ్రోన్ల సహాయంతో కౌంటింగ్ సెంటర్ నుండి తరలిస్తారు&period; కౌంటింగ్ కేంద్రం పై విలన్ దాడి చేస్తే అక్కడ హీరో ఒక్కడే ఫైట్ చేస్తాడు&period; పోలీసులను వెళ్లి పోవాలని చెప్పగానే వాళ్ళు తమ డ్యూటీ వదిలేసి వెళ్ళి పోతారు&period;సినిమా మొత్తంలో ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రంలో కనిపించడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75809 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;game-changer&period;jpg" alt&equals;"what is your opinion on game changer movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఎన్నో కనీసం జనరల్ నాలెడ్జ్ లేకుండా సిల్లీగా శంకర్ ఈ సినిమా తీశాడు&period; ఈ సినిమాకు మ్యూజిక్ పెద్ద మైనస్&period; ఇక హీరోయిన్ అయితే అందాల ఆరబోతకు తప్ప ఇంకెందుకూ పనికి రాలేదు&period; ఇక కామెడీ అయితే వెగటుగా ఉంది&period; సునీల్ సైడ్ కి నడవడం&comma; చరణ్ తల్లి మెడ తిప్పకుండా పక్కకు చూడటం &lpar; దీనికి ఒక సిల్లీ రీజన్&rpar; ఇవి శంకర్ సినిమా ఆణిముత్యాలు&period; శంకర్ ప్రేక్షకులను వెర్రి వెంగలప్ప లను చేసి తీసిన సినిమా ఇది&period; ఇంకా ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు తమ మానసిక ఆరోగ్యం పై శ్రద్ధ చూపాల్సిన సమయం వచ్చింది అని అర్థం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts