Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

Admin by Admin
July 1, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీమహావిష్ణువే. శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుంద, మధుసూదన, వాసుదేవుని పేర్లతో పిలుస్తారు. భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు. వారు రుక్మిణి , సత్యభామ , జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 16 వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు. అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టమహిషి రుక్మిణి, ఇంకొకరు సత్యభామ. అయితే ఈ ఇద్దరు రాణులు వాసుదేవుడికి భార్యలుగా రావడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. రుక్మిణి విదర్భ రాజు భీష్మకుని కుమార్తె. కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్ననాటి నుంచే రుక్మిణి కోరుకుంది. తన శ్వాస, నిశ్వాసల్లోనూ నిరంతం కృష్ణుని ధ్యానంలో గడిపింది. అయితే ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి ఇష్టం లేదు. రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు.

శిశుపాలుడు, జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు అందుకే రుక్మి వ్యతిరేకించేవాడు. గోవిందుడే తన భర్తగా కోరుకున్న రుక్మిణి ఆ స్థానంలో ఎవరినీ ఊహించడానికి సాహసం చేయలేదు. తన అన్న రుక్మి బలవంతంగా శిశుపాలునితో వివాహం జరిపించాలని భావిస్తున్నాడని, కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటూ కృష్ణుడికి రుక్మిణి సందేశం పంపింది. అలాగే తాను ఆలయంలో ఎదురుచూస్తూ ఉంటానని తెలియజేసింది. సందేశం అందుకున్న వాసుదేవుడు తాను రక్షిస్తానని అభయం ఇచ్చాడు. మందిరంలో గోవిందుడి రాకకోసం రుక్మిణి ఎదురుచూస్తూ పార్వతిని ప్రార్థిస్తూ గడిపింది. కృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి విదర్భ చేరుకుని రుక్మిణిని అక్కడ నుంచి ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం. ఆమె ఎప్పుడూ నారాయణుడి హృద‌య‌ మందిరంలో కొలువుంటుంది. అందుకే రుక్మిణి అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. భూలోకంలో శ్రీహరి అవతరించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండేది.

why lord sri krishna likes rukmini and satyabhama very much

ద్వారక కోశాధికారి సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని వరంగా పొందాడు. శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు నిరాకరిస్తాడు. అతని సోదరుడు ప్రసేనుడు దీన్ని ధరించి వేటకు వెళతాడు. అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది. అదే సమయంలో జాంబవంతుడు సింహాంతో పోరాడి శమంతకమణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోడానికి కృష్ణుడు ఆ మణిని వెదుకుతూ అడవికి బయలుదేరుతాడు. జాంబవంతుడి దగ్గర ఉన్నట్లు గుర్తించి, అతడు ఉండే గుహకు వెళతాడు. అక్కడ జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితోపాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.

శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకుని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఈమె గొప్ప విష్ణు భక్తురాలు. అంతే కాదు ఆయనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు. త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడి రాజ్యంలో బందీగా ఉన్న ఆమెను కలుసుకుంటాడు. తాను ఈ జన్మలో ఏకపత్నీ వ్రతుడనని, వచ్చే జన్మలో వివాహం చేసుకుని, తన రాజ్యానికి రెండో రాణిగా చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించిన చంద్రకాంతను కృష్ణుడు పరిణయమాడాడు. అలాగే పురాణాల ప్రకారం సత్యభామను భూదేవి అవతారంగా పేర్కొంటారు. లక్ష్మీ, భూదేవి అంశంతో జన్మించిన రుక్మిణి, సత్యభామలంటే గోవర్దన గిరిధారికి అందుకే అంత ఇష్టం. నరకాసుర సంహారంలోనూ సత్యభామ పాత్ర కీలకం.

Tags: Lord Sri Krishna
Previous Post

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏయే రోజుల్లో, తిథుల్లో గృహ ప్ర‌వేశం చేయాలి..?

Next Post

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

Related Posts

lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

July 9, 2025
ఆధ్యాత్మికం

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

July 9, 2025
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

July 9, 2025
lifestyle

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

July 9, 2025
information

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

July 9, 2025
పోష‌ణ‌

ఈ సీజ‌న్‌లోనే కనిపించే కాయ‌లు ఇవి.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

July 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.