Karivepaku Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే 10 నిమిషాల్లో ఇలా క‌రివేపాకు రైస్ చేయండి..!

Karivepaku Rice : మ‌న‌లో చాలా మంది కూర‌ల్లో వేసిన క‌రివేపాకును ఏరి పక్క‌కు పెడుతూ ఉంటారు. కానీ క‌రివేపాకులో కూడా ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌రివేపాకును కానీ మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. కానీ దీనిని చాలా మంది నేరుగా తిన‌రు. క‌నుక క‌రివేపాకుతో రైస్ ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు క‌రివేపాకులోని పోష‌కాలను కూడా పొంద‌వ‌చ్చు. క‌రివేపాకుతో చేసే రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌రివేపాకుతో క‌రివేపాకు రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌రివేపాకు రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌రివేపాకు – ఒక క‌ప్పు, బియ్యం – పావు కిలో , ప‌ల్లీలు – పావు క‌ప్పు, నూనె – 5 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5 లేదా త‌గిన‌న్ని, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1 ( పెద్ద‌ది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ప‌చ్చి బ‌ఠాణి – పావు క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

క‌రివేపాకు రైస్ త‌యారీ విధానం..

దీనిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ బియ్యంలో త‌గినంత‌ ఉప్పు, కొద్దిగా నూనె వేసి అన్నాన్ని వండి పొడిగా చేసుకుని ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో ప‌ల్లీల‌ను వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి. త‌రువాత శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టిన క‌రివేపాకును వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడి అయ్యే వ‌ర‌కు మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాయ్యాక దాల్చిన చెక్క‌, ల‌వంగాలు,యాల‌కులు వేసి వేయించాలి. త‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.

Karivepaku Rice very tasty make in this method very healthy
Karivepaku Rice

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బ‌ఠాణీల‌ను వేసి అవి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. బ‌ఠాణీలు ఉడికిన త‌రువాత ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత పొడిగా చేసుకున్న అన్నాన్ని, మిక్సీ ప‌ట్టుకున్న క‌రివేపాకు పొడిని వేసి క‌లుపుతూ 3 నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత నెయ్యి వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు రైస్ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అన్నం మిగిలిన‌ప్పుడు లేదా ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా క‌రివేపాకుతో చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే క‌రివేపాకు రైస్ త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts