Massage For Pain : సాధారణంగా కాలు లేదా చెయ్యి బెణికినప్పుడు బెణికిన చోట తైలం లేదా యాంటీ ఇన్ ప్లామేటరీ క్రీములను రాస్తూ ఉంటాం. ఇది మనందరం చేసే పనే. కానీ ఇలా చేస్తే అది వికటించి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. మన భారత దేశంలో ఆయుర్వేదం కంటే ముందే నాటు వైద్యం వంటివి అందుబాటులో ఉన్నాయి. శరీరంలో ఎక్కడైనా బెణికినా, దెబ్బ తగిలినా ఆయా చోట్ల రకరకాల నూనెలను రాసి నాటు వైద్యంలో భాగంగా మర్దనా చేసి నయం చేసే వారు. ఒక్కోసారి మరీ ఎక్కువ శక్తి ఉపయోగించి మర్దనా చేసినా కూడా నాటు వైద్యం ఇప్పటి వరకు ఎప్పుడూ వికటించలేదు.
అలా ఎక్కువ శక్తి ఉపయోగించి మర్దనా చేయడం ప్రమాదమని తెలిసిన కొందరూ వైద్యులు బెణికిన చోట క్రీమ్ రాసి కొద్దిగా మర్దనా చేస్తే సరిపోతుందని హెచ్చరిస్తూ ఉంటారు. వైద్యులు చెప్పేది వినకుండా ఎక్కువ శక్తిని ఉపయోగించి మర్దనా చేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదమని రుజువైంది. ఒక యువకుడు బ్యాట్మింటన్ ఆడుతుండగా అతని కాలి మడమకు గాయమైంది. దీని కారణంగా అతని కాలినరాల్లో రక్తం గడ్డకట్టంది. కాలికి వేసిన ప్లాస్టర్ తీసివేసినప్పటికి అతని కాలు నొప్పి, వాపు తగ్గలేదు. కొడుకు బాధను చూడలేని తల్లి కాలికి మర్దనా చేసింది. మర్దనా చేసే సమయంలో ఆమె ఉపయోగించిన శక్తికి కాలిలో గడ్డకట్టిన రక్తం అక్కడి నుండి కదిలి అతని గుండెలోకి చేరింది. దీంతో గుండె ఆగిపోయి ఆ యువకుడు మరణించాడు.
తల్లి తెలియక చేసిన తప్పు ఆమె కుమారుడి ప్రాణాలను తీసింది. నిజానికి గడ్డకట్టిన రక్తం వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడితే దానంతట అదే కరుగుతుంది. అంతర్ నాళాలలో రక్తం గడ్డకట్టినప్పుడు మాత్రమే చాలా అరుదుగా ఇలాంటివి సంభవిస్తాయి. ప్లాస్టర్ తీసేసిన తరువాత కూడా నొప్పి తగ్గకపోతే ఎముకల వైద్యున్ని సంప్రదించాలి కానీ సొంత వైద్యం చేసుకోకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.