హెల్త్ టిప్స్

మీ రోజువారి దిన‌చ‌ర్య‌లో ఈ మార్పులు చేస్తే చాలు.. బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు..

విపరీతమైన ఆకలిని ఆపుకుంటూ డైటింగ్, చెమటోడ్చి చేసే జిమ్ వర్కవుట్లు వంటివి చేయకుండా సహజంగా స్లిమ్ అయిపోవడం ఎలా? అనేది పరిశీలిద్దాం. మనం చేసే రోజువారీ పనులలో కొన్నింటిలో మార్పులు చేసుకోండి. కొంచెం కష్టమైనప్పటికి వాటిని ఆచరిస్తూ వుంటే…మీరు ఆశించే ఫలితాలు లభిస్తాయి. సహజ స్లిమ్ బాడీకి చిట్కాలు ఎలా వుంటాయో చూడండి. అపార్టుమెంట్లలో వున్నా లేక ఆఫీసులలో పని చేస్తున్నా లిఫ్ట్ ఉపయోగించకండి. మెట్లు ఎక్కి మీ ఇంట్లోకి లేదా ఆఫీసులోకి వెళ్లండి.

ఇంటి పని – కాస్తంత మీ అహం పక్కన పెట్టండి. పనిమనిషిని మాన్పించండి. ఇంటిలోని పనంతా మీరే చేసుకోండి. ప్రతిరోజూ నేల తుడవటం వంటివి మీ నడుముకు, చేతులకు చక్కటి వ్యాయామాన్నిస్తాయి. శరీరాన్ని వంచండి – ప్రతి రోజూ మీరు చేసే పనులలో ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు నడుం కిందకు వంచండి. షూ లేసులు కట్టేటపుడు లేదా వంట గదిలో పని చేసేటపుడు వీలైనన్ని సార్లు కిందకు వంగడం లేదా కూర్చొని లేవడం వంటివి చేయండి. ఆధునిక కిచెన్ లో కిచెన్ ఫ్లాట్ ఫారమ్ లు నిలబడి పనిచేసేవిగా వుంటూ మహిళల నడుములకు బలాన్ని తగ్గిస్తున్నాయి.

do these small changes in your daily life to reduce weight

నడవండి – ఇంటిలో వుండే వారైనా, లేక ఆఫీస్ లలో పని చేసేవారైనా, వాహనాలున్నప్పటికి వాటిని కొంత దూరంలో వుంచి మరి కొంత దూరం నడవటం ఎంతో మంచిది. నడక శరీరానికి కావలసినంత వ్యాయామం కలిగిస్తుంది. లేదా సైకిలు ఉపయోగించి, షాపింగ్, స్నేహితుల ఇల్లు, దగ్గరలో వున్న బ్యాంకు, ఇతర చిన్నపాటి పనులకు వివిధ ప్రదేశాలకు వెళ్ళి కాలి పిక్కలకు, తొడలకు తగు వ్యాయామం కల్పించండి. ఈ చిట్కాలు పాటించి మీ జీవన విధానం మార్చుకోడం ద్వారా సహజంగా బరువు తగ్గి స్లిమ్ గా వుండి ఆనందించండి.

Admin

Recent Posts