Aloo Curry For Puri : పూరీల‌లోకి ఒక్క‌సారి ఇలా ఆలు క‌ర్రీని చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Curry For Puri : మ‌నం అల్పాహారంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే పూరీల‌ను తిన‌డానికి చేసే కూర రుచిగా ఉంటేనే వీటిని మ‌నం చ‌క్క‌గా తిన‌గ‌లుగుతాము. పూరీల‌ల్లోకి ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ల్లోకి మ‌నం బంగాళాదుంప‌ల‌తో కూడా కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా బంగాళాదుంప‌ల‌తో పూరీ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – పావు కిలో, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కొత్తిమీర – కొద్దిగా.

Aloo Curry For Puri try this once recipe is here
Aloo Curry For Puri

ఆలూ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఉడికించిన బంగాళాదుంప‌లను కొద్దిగా మెత్త‌గా చేసుకోవాలి. వీటిని మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా ముక్క‌లుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మెత్త‌గా చేసుకున్న బంగాళాదుంప‌ల‌ను వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరి మెంతి వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, పూరీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts