Aloo Curry : ఆలూ క‌ర్రీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి రుచి చూస్తే.. మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..

Aloo Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలో, మ‌న అందాన్ని పెంపొందించ‌డంలో బంగాళాదుంప మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. బంగాళాదుంప‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ బంగాళాదుంప‌ల‌తో చ‌పాతీ, పుల్కా, రోటీ, నాన్ వంటి వాటిని తిన‌డానికి రుచిగా, సులువుగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 1, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, చిన్నగా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – రెండురెమ్మ‌లు, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా త‌గినంత‌ , జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ముప్పావు టీ స్పూన్, నీళ్లు – ఒక టీ గ్లాస్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Curry recipe in telugu very easy to make
Aloo Curry

ఆలూ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీల‌క‌ర్ర‌, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ప‌సుపు, కారం, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, క‌సేరి మెంతి వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌ను చేత్తో న‌లిపి వేసుకోవాలి. వీటిని మ‌రీ మెత్త‌గా కాకుండా కొన్ని ముక్క‌లు ఉండేలా వేసుకుని క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత ఉంచి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాట‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ఆలూ క‌ర్రీ కంటే ఈ విధంగా చేసిన ఆలూ క‌ర్రీని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు.

D

Recent Posts