Aloe Vera Juice For Gas Trouble : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో పొట్టలో గ్యాస్ సమస్య కూడా ఒకటి. గ్యాస్ సమస్య వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. పొట్టలో గ్యాస్ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, ఆహారాన్ని ఎక్కువగా సార్లు తీసుకోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం , మలబద్దకం, మసాలాలు, పులుపులు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సంవత్సరాల తరబడి మందులు వాడినప్పటికి ఈ సమస్య తగ్గక ఇబ్బందిపడుతున్న వారి సంఖ్య నేటి తరుణంలో అధికంగా ఉంది. పొట్టలో గ్యాస్ సమస్య నుండి బయట పడడానికి మందులను వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది.
కనుక మనం ఈ గ్యాస్ సమస్యను సహజ సిద్దంగా తగ్గించుకోవడమే చాలా ఉత్తమం. పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడే వారు కలబంద జ్యూస్ ను తాగడం వల్ల 4 నుండి 5 వారాల్లోనే ఎంతో కాలంగా వేధిస్తున్న గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కలబంద జ్యూస్ గ్యాస్ సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుందని ఇరాన్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. కలబందలో ముఖ్యంగా అలాక్టిన్ ఎ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పొట్టలో గ్యాస్ కారణంగా జీర్ణాశయం అంచుల వెంబడి ఉండే పొరలు దెబ్బతింటాయి. ఈ పొరల్లో ఉండే కణజాలాన్ని మెరుగుపరిచి వాటిని సాధారణ స్థితికి తీసుకు రావడంలో కలబంద జ్యూస్ సహాయపడుతుంది.
అలాగే జీర్ణాశయం అంచుల వెంబడి ఉండే పొరలు జిగురును ఎక్కువగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల గ్యాస్ సమస్య అధికమవ్వడంతో పాటు ఈ సమస్య వల్ల కలిగే ఇబ్బంది కూడా ఎక్కువవుతుంది. జీర్ణాశయం అంచుల వెంబడి జిగురు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే చేసి గ్యాస్ సమస్యను తగ్గించడంలో ఈ కలబంద జ్యూస్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ జ్యూస్ లో ఉండే మినరల్స్ పొట్టలో ఉండే పి హెచ్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో కూడా దోహదపడతాయి. ఈ కలబంద జ్యూస్ ను ఉదయం 10 ఎమ్ ఎల్ అలాగే సాయంత్రం 10 ఎమ్ ఎల్ మోతాదులో భోజనానికి ముందు తీసుకోవాలి. ఈ కలబంద జ్యూస్ లో అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసి కలిపి తీసుకోవచ్చు. రెండు పూటలా ఈ విధంగా కలబంద జ్యూస్ ను తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుండి మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.