Aloo Gobi Masala : ఆలు, కాలిఫ్ల‌వ‌ర్ క‌లిపి ఇలా మ‌సాలా కూర చేయండి.. చ‌పాతీ, అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Gobi Masala : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే క‌ర్రీల‌ల్లో ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌పాతీ వంటి వాటిలోకి ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ ఆలూ గోబి క‌ర్రీని అదే స్టైల్ లో అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల అచ్చం అదే రుచితో ధాబా స్టైల్ ఆలూ గోబి మ‌సాలా కర్రీని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ఆలూ గోబి మ‌సాలా కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి…. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ గోబి మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యూబ్స్ లాగా త‌రిగిన బంగాళాదుంప‌లు – 200 గ్రా., క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – 15, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ట‌మాటాలు – పెద్ద‌వి మూడు, నీళ్లు – 150 ఎమ్ ఎల్, బ‌ట‌ర్ – 2 టీ స్పూన్స్, క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Gobi Masala recipe in telugu make in this way
Aloo Gobi Masala

ఆలూ గోబి మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా నీటిలో బంగాళాదుంప ముక్క‌లు, ప‌సుపు వేసి ఉడికించాలి. బంగాళాదుంప ముక్క‌ల‌ను 80 శాతం వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నీటిలో క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వీటిని కూడా 80 శాతం వ‌ర‌కు ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత కారం, ఉప్పు, గ‌రం మ‌సాలా, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉడికించిన బంగాళాదుంప ముక్క‌లు, క్యాలీప్ల‌వ‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి ఉడికించాలి. ముక్క‌లు ఉడికిన త‌రువాత బ‌ట‌ర్, క్రీమ్ వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌క ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గోబి మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts