Aloo Masala Curry : ఆలు మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి రుచి అదిరిపోతుంది..!

Aloo Masala Curry : మ‌నం బంగాళాదుంప‌లతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవరైనా ఈ కూర‌ను చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా చ‌క్క‌టి వాస‌న‌తో ఉండే ఈ ఆలూ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బేబి పొటాటోస్ – 200 గ్రా., నూనె – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Masala Curry recipe in telugu make in this way
Aloo Masala Curry

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, జీడిప‌ప్పు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క‌, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2.

ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా బేబి పొటాటోస్ ను 70 శాతం ఉడికించి పొట్టు తీసుకోవాలి. త‌రువాత వాటికి ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి. త‌రువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో మ‌సాలాకు కావ‌ల్సిన ప‌దార్థాల్నీ వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత బేబి పొటాటోస్ ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో జీల‌క‌ర్ర వేసి వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. తరువాత వేయించిన పొటాటోస్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చపాతీ, పూరీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts