Amazon : అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌.. ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon : ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ శ‌నివారం ప్రారంభం కాగా ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను, టీవీల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. వ‌న్‌ప్ల‌స్‌, శాంసంగ్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, టెక్నో కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌తోపాటు శాంసంగ్‌, అమెజాన్ బేసిక్స్‌, హైసెన్స్‌, సోనీ, షియోమీ.. వంటి బ్రాండ్ల‌కు చెందిన టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

Amazon  special sale offers huge discounts on smart phones and tvs
Amazon

ఈ సేల్‌లో భాగంగా మొబైల్ యాక్స‌స‌రీల‌ను డిస్కౌంట్ రేటుతో రూ.69 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ప‌వ‌ర్ బ్యాంకుల‌ను రూ.399 ప్రారంభ ధ‌ర నుంచి విక్ర‌యిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 11టి 5జి ఫోన్‌ను రూ.22,999 కాకుండా రూ.19,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అలాగే ఎంఐ 11 ఎక్స్ ఫోన్ రూ.6వేల డిస్కౌంట్‌తో రూ.25,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. గెలాక్సీ ఎం52 5జి ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీన్ని రూ.34,999 ధ‌ర‌కు బ‌దులుగా రూ.22,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అలాగే గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ రూ.23,999 కి కాకుండా రూ.20,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

ఐక్యూ జ‌డ్‌5 స్మార్ట్ ఫోన్ రూ.8వేల డిస్కౌంట్‌తో రూ.21,990కి, ఐక్యూ 7 ఫోన్ రూ.27,990 ధ‌ర‌కు, ఒప్పో ఎ15 రూ.10,641, రియ‌ల్‌మి నార్జో 50ఎ స్మార్ట్ ఫోన్ రూ.10,349 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. అలాగే టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ ఫోన్‌ను రూ.6,699 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు.

ఇక టీవీల విష‌యానికి వ‌స్తే 32 ఇంచుల రెడ్‌మీ టీవీ ధ‌ర రూ.14,998గా ఉంది. 50 ఇంచుల టీవీని రూ.34,998కి విక్ర‌యిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన 43 ఇంచుల 4కె టీవీ ధ‌ర రూ.36,990గా ఉంది. అమెజాన్ బేసిక్స్‌కు చెందిన 50 ఇంచుల 4కె టీవీ ధ‌ర రూ.32,999 ఉండ‌గా, సోనీ 55 ఇంచుల 4కె టీవీ ధ‌ర రూ.75,990గా ఉంది. ఇక ప‌లు బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో అద‌న‌పు రాయితీని కూడా పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts