Arati Garelu : అరటికాయ‌ల‌తో చేసే గారెల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటాయి..

Arati Garelu : సాధార‌ణంగా కూర అర‌టికాయ‌ల‌తో చాలా మంది కూర‌లు, వేపుడు వంటి వంట‌ల‌ను చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. స‌రిగ్గా చేయాలే కానీ అర‌టికాయ కూర‌, వేపుడు ఎంతో బాగుంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి. అయితే అర‌టికాయ‌ల‌తో కేవ‌లం ఇవే కాదు.. ఎంతో రుచిక‌ర‌మైన గారెల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి కూడా అంద‌రికీ ఎంత‌గానో న‌చ్చుతాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. అర‌టికాయ‌ల‌తో గారెల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టి గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌టికాయ‌లు – 2, శ‌న‌గ‌పిండి – 1 క‌ప్పు, మిన‌ప ప‌ప్పు – 1 టేబుల్ స్పూన్‌, శ‌న‌గ ప‌ప్పు – 1 టేబుల్ స్పూన్‌, ఎండు మిర‌ప‌కాయ‌లు – 2, నూనె – త‌గినంత‌, ఉప్పు – 2 టీస్పూన్లు, కారం – 2 టీస్పూన్లు, ఉల్లి త‌రుగు – 1 క‌ప్పు.

Arati Garelu recipe in telugu very tasty make like this
Arati Garelu

అర‌టి గారెల‌ను త‌యారు చేసే విధానం..

అర‌టికాయ‌ల‌ను మూడు నాలుగు ముక్క‌లుగా చేసి ఉడికించాలి. తొక్క తీసి అర‌టి కాయ‌ల‌ను గుజ్జులా చేయాలి. బాణ‌లిలో నూనె వేసి కాగాక మిన‌ప ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు, మిర‌ప‌కాయ‌లు వేసి దోర‌గా వేయించాలి. ఒక పాత్ర‌లో అర‌టికాయ ముద్ద‌, వేయించిన పోపు, ఉల్లి త‌రుగు, ఉప్పు, కారం, శ‌న‌గ పిండి వేసి గారెల పిండిలా క‌లుపుకోవాలి. స్ట‌వ్ మీద బాణ‌లిలో నూనె వేసి కాగాక త‌యారు చేసి ఉంచుకున్న పిండిని గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి. గారెలు బంగారు రంగులోకి వ‌చ్చే వ‌ర‌కు లేదా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి తీయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన అర‌టి గారెలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా చ‌ట్నీలోనూ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఎప్పుడూ చేసే రెగ్యుల‌ర్ గారెల‌కు బ‌దులుగా ఓసారి ఇలా అర‌టి గారెల‌ను ట్రై చేయండి. ఎంతో బాగుంటాయి.

Share
Editor

Recent Posts