తెలుగు సినిమా పరిశ్రమకి టైటిల్ కొరత ఎప్పుడూ ఉంటుంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఈ టైటిల్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు అంతగా టైటిల్స్ సమస్య ఉండేది కాదని, ఇప్పుడు చాలా ఎక్కువ అనే చెప్పాలి. సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత, దాదాపు 12 ఏళ్ల పాటు మళ్ళీ ఆ పేరును ఇంకో సినిమాకు వాడకూదడు అని నిర్మాత మండలి షరతు పెట్టింది. కానీ, కొన్నిసార్లు ఈ షరతు వర్తించలేదు. సేమ్ టైటిల్స్ తో రెండు సినిమాలు విడుదలయ్యాయి.
గతంలో స్టార్ హీరో శోభన్ బాబు, యువరత్న నందమూరి బాలకృష్ణ ఒకే టైటిల్ తో సినిమాలు చేశారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘తల్లిదండ్రులు’. 1970 లో మొదట శోభన్ బాబు హీరోగా తల్లిదండ్రులు అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో శోభన్‌బాబుకు జోడీగా చంద్రకళ నటించింది. ఈ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా మహానటి సావిత్రి, తండ్రిగా జగ్గయ్య నటించారు. ఈ సినిమా అభిమానులను అంతగా అలరించలేదు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఇక తల్లిదండ్రులు టైటిల్‌తో 1991లో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
బాలయ్య తల్లిదండ్రులు చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. తాతినేని రామారావు దర్శకుడు. ఉమ్మడి కుటుంబంలో పుట్టిన బాలకృష్ణ పనిపాటా లేకుండా డబ్బు బాగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇక డ్యాన్స్ టీచర్‌గా పనిచేసే విజయశాంతికి, బాలయ్యకు అస్సలు పడదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వీరు ప్రేమలో పడతారు. బాలయ్య కూడా కుటుంబం గురించి తెలుసుకుని మారతాడు. ఇది సినిమా స్టోరీ. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయ్యింది. మొత్తానికి ఒకే టైటిల్‌తో ఇద్దరు స్టార్ హీరోలు సినిమా చేయగా, ఒకటి మంచి విజయం సాధించింది. రెండోది బోల్తా కొట్టింది.