వినోదం

Vijayashanti : విజ‌య‌శాంతి కోసం బాలయ్య త్యాగం చేశారా.. ఏమిట‌ది..?

Vijayashanti : నందమూరి నటసింహం బాలకృష్ణ, లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి కాంబినేషన్ లో ముద్దుల కృష్ణ‌య్య, భలేదొంగ, కథానాయకుడు, అపూర్వ సహోదరులు ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అంతేకాదు బాలయ్యతో నిప్పురవ్వ మూవీని కూడా విజయశాంతి నిర్మించి అందులో హీరోయిన్ గా చేసింది.

బాలయ్య, విజయశాంతి హీరో హీరోయిన్స్ గా బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. పోలీసాఫీసర్ పాత్రలో బాలయ్య నటన, డైలాగులు అదరగొట్టాయి. ఇందులో విజయశాంతికి మంచి రోల్ వచ్చింది. ఒక చోట ఫైట్ కూడా చేస్తుంది. అయితే సినిమా ఎడిటింగ్ సమయంలో లెంగ్త్‌ ఎక్కువ కావడంతో విజయశాంతి ఫైటింగ్ సీన్ తీసేయాలని డైరెక్టర్ బి గోపాల్ భావించారు.

balakrishna did that favour for vijaya shanthi

ఇదే విషయాన్ని బాలయ్యతో చెప్పడంతో ఆ అమ్మాయి కష్టపడి చేసిన ఫైట్ తీసేస్తే ఎలా.. కావాలంటే నా ఫైటింగ్ సీన్ ఒకటి తీసెయ్యండి అని బాలయ్య చెప్పడంతో డైరెక్టర్ నిర్ఘాంతపోయారట. యథాతథంగా విజయశాంతి ఫైట్ ఉంచేశారు. సాధారణంగా హీరోయిన్ కన్నా పైచేయి ఉండాలని చాలామంది హీరోలు భావిస్తారు. కానీ బాలయ్య దానికి భిన్నంగా ఉంటారనడానికి ఇదొక తార్కాణం అని చెప్ప‌వచ్చు.

Admin

Recent Posts