Bangarraju : బంగార్రాజు కొద్ది గంట‌ల్లోనే రాబోతున్నాడు.. ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలానో తెలుసా?

Bangarraju : అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన సూప‌ర్ హిట్ చిత్రం బంగార్రాజు. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గతంలో నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు చిత్రం వినోదం, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆలరించింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమైంది. జీ5 ఓటీటీ బంగార్రాజు సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ రోజు అర్ధ‌రాత్రి నుండి ఈ చిత్రం ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది. థియేట‌ర్‌లో సినిమా చూడ‌ని వారు ఓటీటీలో సినిమా చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయవ‌చ్చు.

బంగార్రాజు సినిమా 2022లో మన దేశంలో ఫస్ట్ హిట్ అందుకున్న సినిమాగా సినిమా రికార్డులకు ఎక్కింది. కరోనా థర్ట్ వేవ్‌లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే స్టోరీ కూడా బాగుండటంతో ఈ సినిమా పంట పండింది.

Bangarraju reasy to entertain this night
Bangarraju reasy to entertain this night

బంగార్రాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా తడాఖాను చూపించింది. బంగార్రాజు చిత్రం 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో సంక్రాంతి బరిలో దిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 35.42 కోట్లు షేర్, 58 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 38.77 కోట్ల షేర్, 65.25 గ్రాస్ వసూళ్లను సాధించింది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించలేకపోయారు. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వ‌స్తున్న నేప‌థ్యంలో చ‌క్క‌గా సినిమాని ఇంట్లోని కూర్చొని వీక్షించొచ్చు.

Editor

Recent Posts