Beerakaya Milk Curry : బీరకాయ పాల కర్రీ ఇలా చేసుకుంటే.. అన్నం, చపాతీ, పూరీల‌లోకి రుచిగా ఉంటుంది..!

Beerakaya Milk Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయలు కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీర‌కాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన కూర‌ల‌ల్లో బీర‌కాయ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని పాలు పోసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాలు పోసి చేసే ఈ బీర‌కాయ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనాచాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బీరకాయ క‌ర్రీని పాలు పోసి మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌కాయ పాల‌కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీర‌కాయ‌లు – అర‌కిలో, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒకటిన్న‌ర టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఉప్పు -త‌గినంత‌,ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, పాలు – పావు లీట‌ర్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Beerakaya Milk Curry recipe in telugu very tasty easy to make
Beerakaya Milk Curry

బీర‌కాయ పాల‌క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శ‌న‌గ‌ప‌ప్పు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, పచ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత బీర‌కాయ ముక్క‌లు వేసి పెద్ద మంట‌పై 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 6 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత పాలు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి బీర‌కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ పాల‌క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా చేసే బీర‌కాయ క‌ర్రీ కంటే ఈ విధంగా పాలు పోసి చేసిన బీర‌కాయ కర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

Share
D

Recent Posts