Spinach For Vitamin B12 : ఈ కూర‌లో విట‌మిన్ బి12 ట‌న్నులు ట‌న్నులు ఉంటుంది.. వారంలో రెండు సార్లు తిన్నా చాలు..!

Spinach For Vitamin B12 : మ‌న శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డాల‌న్నా, శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా ప‌ని చేయాల‌న్నా మ‌న శ‌రీరానికి ఎన్నో పోషకాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అవ‌స‌ర‌మ‌వుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన విట‌మిన్స్ లో విట‌మిన్ బి 12 కూడా ఒక‌టి. నాడీ మండ‌ల వ్య‌వస్థ స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేయ‌డంలో, ర‌క్త‌క‌ణాల త‌యారీలో, క‌ణ‌జాలం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ బి 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ బి 12 ఉండ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, అరికాళ్ల‌ల్లో మంట‌లు, సూదుల‌తో గుచ్చిన‌ట్టుగా ఉండ‌డం, చిరాకు, కోపం, ఆందోళ‌న, ఏ ప‌ని మీద కూడా ఏకాగ్ర‌త చూపించ‌లేక‌పోవ‌డం, మ‌తిమ‌రుపు వంటి స‌మ‌స్య‌లు విట‌మిన్ బి 12 లోపించ‌డం వ‌ల్ల త‌లెత్తుతాయి.

అలాగే కొంద‌రిలో విట‌మిన్ బి 12 లోపించ‌డం వ‌ల్ల విరోచ‌నాలు, క‌డుపు ఉబ్బ‌రం, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు కూడా క‌నిపిస్తాయి. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డాలంటే విట‌మిన్ బి 12 ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. విట‌మిన్ బి 12 ఎక్కువ‌గా మాంసాహారంలో ఉంటుంది. అలాగే పాలను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం విట‌మిన్ బి 12 లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌డం వ‌ల్ల విట‌మిన్ బి 12 లోపాన్ని చాలా సుల‌భంగా అధిగ‌మించ‌వ‌చ్చు. అదే విధంగా పెరుగు, చీజ్, కోడిగుడ్లు, పాల‌కూర వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ బి 12 ల‌భిస్తుంది. వారానికి రెండు నుండి మూడు సార్లు పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ బి 12 లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు.

Spinach For Vitamin B12 take regularly to get most benefits
Spinach For Vitamin B12

అయితే చాలా మంది పాల‌కూర‌ను త‌రిగి నీటిలో క‌డుగుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల విట‌మిన్ బి 12 నీటి ద్వారా తొల‌గిపోతుంది. క‌నుక పాల‌కూర‌ను క‌డిగిన త‌రువాత ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల, శ‌న‌గ‌ల‌ను ఉడికించి లేదా మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ బి 12 లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు. ఈవిధంగా పైన చెప్పిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ బి 12 ల‌భిస్తుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు విట‌మిన్ బి 12 లోపం త‌లెత్త‌కుండా చూసుకోవాలని లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts