Bellam Jilebi : బెల్లం జిలేబీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఎంతో రుచిగా చేసుకోవ‌చ్చు..!

Bellam Jilebi : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో జిలేబీలు క‌డా ఒక‌టి. జిలేబీలు చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువ‌గా పంచ‌దార‌తో త‌యారు చేస్తారు. అయితే మ‌ధ్య‌కాలంలో ఈ జిలేబీల‌ను బెల్లంతో కూడా త‌యారు చేస్తున్నారు. బెల్లం జిలేబీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. అలాగే ఇన్ స్టాంట్ గా, అప్ప‌టిక‌ప్పుడు వీటిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, స్పెషల్ డేస్ లో లేదాతీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా బెల్లం జిలేబీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. పైన క్రిస్పీగా లోప‌ల జ్యూసీగా ఉండే ఈ బెల్లం జిలేబీల‌ను ఇంట్లోనే ఇన్ స్టాంట్ గా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం జిలేబి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – ఒక క‌ప్పు, ఉప్పు – చిటికెడు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – 2 టీ స్పూన్స్, బెల్లం తురుము – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Bellam Jilebi recipe in telugu very tasty sweet
Bellam Jilebi

బెల్లం జిలేబి త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, బియ్యంపిండి, బేకింగ్ పౌడ‌ర్, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్నినీళ్లు పోసుకుంటూ పిండిని గంటె జారుడుగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత మ‌రో 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఫుడ్ క‌ల‌ర్, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత పిండిని మ‌రోసారి క‌లుపుకుని దీనిని పాల ప్యాకెట్ లో లేదా నూనె ప్యాకెట్ లో, మందంగా ఉండే వ‌స్త్రంలో వేసి మూట క‌ట్టాలి. త‌రువాత వాటికి ఒక చివ‌ర‌న్న చిన్న రంధ్రం చేసుకోవాలి.

ఇప్పుడు పిండిని మ‌ధ్య‌స్థంగా వేడైన నూనెలో జిలేబిలాగా వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి. ఈ జిలేబీల‌ను అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకున్న త‌రువాత వీటిని తీసి గోరు వెచ్చ‌గా అన్న బెల్లం పాకంలో వేసుకోవాలి. ఈ జిలేబీల‌ను ఒక నిమిషం పాటు అలాగే ఉంచి త‌రువాత ప్లేట్ లో వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం జిలేబీలు త‌యార‌వుతాయి. ఈ విధంగా బెల్లం జిలేబీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇంట్లోనే త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts