Sweet Lime Juice For Sleep : మనం రోజూ 6 నుండి 8 గంటల పాటు గాఢ నిద్రపోవడం చాలా అవసరం. చాలా మంది నిద్ర పోయినప్పటికి మధ్యలో 3 నుండి 4 సార్లు మెలుకువ వచ్చి లేస్తూ ఉంటారు. మరలా నిద్ర పోవడానికి సమయం పడుతుంది. కానీ మనం తప్పకుండా గాఢ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయినప్పుడే మనం రోజూ ఉదయం ఉత్పాహంగా పని చేసుకోవచ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ నిద్ర పోవాలంటే మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి. ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే మన శరీరంలో ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి. ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అయితే మెలటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనకు గాఢ నిద్ర పడుతుంది.
ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే దానికి తగిన ఆహారాలను మనం తీసుకోవాలి. అలాగే మన జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. గాఢ నిద్ర కోసం మనం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాఢ నిద్ర కావాలనుకునే వారు రోజూ కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం మంచిది. కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో ఒక గ్లాస్ కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మెలటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనకు చక్కటి గాఢ నిద్ర పడుతుంది. ఇలా జ్యూస్ ను తీసుకోవడంతో పాటు చీకటి పడిన తరువాత వీలైనంత వరకు కంటి మీద వెలుగు పడకుండా చూసుకోవాలి. కంటి మీద వెలుగు పడడం వల్ల, ఫోన్స్ చూడడం వల్ల మెలటోనిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.
ఈ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల నిద్ర సరిగ్గా రాదు. కనుక రాత్రి పూట ఫోన్స్ కి, టివీలకు వీలైనంత దూరంగా ఉండాలి. దీంతో గాఢ నిద్ర సొంతం చేసుకోవచ్చు. అలాగే రోజూ సాయంత్రం 6 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఆలస్యంగా భోజనం చేసే అలవాటును వీలైనంత వరకు వదులుకోవాలి. త్వరగా భోజనం చేసి నిద్రించడం వల్ల మనం గాఢ నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా గాఢ నిద్రను పొందవచ్చని అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.