ఆధ్యాత్మికం

తమలపాకులపై దీపం వెలిగిస్తే ఎలాంటి కష్టాలు అయినా సరే పోతాయి.. ధనం లభిస్తుంది..!

తమలపాకులను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే తమలపాకులపై దీపాలను వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. తమలపాకుల కాడల్లో పార్వతీ దేవీ కొలువై ఉంటుంది. అలాగే తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. తమలపాకుల మధ్యలో సరస్వతీ దేవి కొలువై ఉంటుంది. అందువల్ల తమలపాకులపై దీపాలను వెలిగిస్తే ముగ్గురమ్మలు మనపై అనుగ్రహిస్తారు. శుభాలను అందిస్తారు.

తాజాగా ఉండే తమలపాకులను ఆరు తీసుకోవాలి. తమలపాకుల చివర్లు, కాడలు విరిగిపోనివి, ఎండిపోనివి అయి ఉండాలి. తాజాగా ఉండాలి. అలాంటి తమలపాకులను తీసుకుని పూజ గదిలో అమ్మవార్ల చిత్రపటాలు లేదా విగ్రహాల ముందు నెమలి ఫించం ఆకారంలో ఉంచాలి. తరువాత ఆ ఆకులపై మట్టి ప్రమిదను ఉంచాలి. అందులో తమలపాకులకు చెందిన కాడలను కొద్దిగా తుంచి వేయాలి. అనంతరం నూనె పోసి దీపాన్ని వెలిగించాలి.

betel leaves deepam removes your problems

దీపాన్ని వెలిగించేందుకు నువ్వుల నూనెను ఉపయోగించాలి. దీంతో ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. సుఖ సంతోషాలు ఏర్పడుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. అన్నీ శుభాలే కలుగుతాయి. ముగ్గురమ్మలకు చెందిన అనుగ్రహం మనపై ఉంటుంది. సంపద సిద్ధిస్తుంది. ఈ విధంగా దీపాన్ని రోజూ ఉదయాన్నే వెలిగించి పూజ చేస్తే మంచిది.

Admin

Recent Posts