OTT : తెలుగు ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఈ నెల పండుగే..!

OTT : ఓటీటీల పుణ్య‌మా అని ప్రేక్ష‌కులు ఇప్పుడు చాలా వ‌ర‌కు సినిమాల‌కు వెళ్ల‌డం లేదు. అగ్ర హీరోల‌కు చెందిన సినిమాలు రిలీజ్ అయితేనే వారి ఫ్యాన్స్ సినిమాల‌కు వెళ్తున్నారు. ఇక సినిమా మీద ఉండే ఆస‌క్తితో చాలా మంది సినిమాల‌కు వెళ్తున్నారు. కానీ చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు. సినిమా విడుద‌లైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తుంది. క‌నుక అప్ప‌టి వ‌ర‌కు ఆగుతున్నారు. ఇక ఈ నెల‌లో ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోల సినిమాలు ఓటీటీల్లో సంద‌డి చేయ‌గా.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మ‌రిన్ని సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి.

big entertainment for Telugu OTT audience in this month
OTT

ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం ఖిలాడి. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయితే కాలేదు.. కానీ యావ‌రేజ్ టాక్‌ను సాధించింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే మూవీ కూడా ఈ నెల‌లోనే ఓటీటీలో రానుంది. మార్చి 25వ తేదీన సోనీ లివ్‌లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయ‌నున్నారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయ‌క్ కూడా ఈ నెల‌లోనే ఓటీటీలో రానుంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, ఆహా యాప్‌ల‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. అయితే క‌చ్చిత‌మైన తేదీని ప్ర‌క‌టించ‌లేదు.. కానీ ఈ నెలాఖ‌రులో ఈ మూవీని స్ట్రీమ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ నెల‌లో అటు థియేట‌ర్ల‌లో రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద చిత్రాలు సంద‌డి చేయ‌నుండ‌డంతోపాటు మ‌రో వైపు ఓటీటీల్లో పైన తెలిపిన అగ్ర హీరోల సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. దీంతో ప్రేక్ష‌కుల‌కు ఎంతో వినోదం ల‌భ్యం కానుంది.

Share
Editor

Recent Posts