Black Chicken Masala : బ్లాక్ చికెన్.. మహారాష్ట్ర వంటకమైన ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, జొన్న రొట్టెలు వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ చికెన్ కర్రీని కూడా ప్రత్యేకమైన పద్దతిలో తయారు చేస్తారు. చూడడానికి నల్లగా ఉన్నప్పటికి ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. స్మోకీ ప్లేవర్ తో చాలా రుచిగా ఉండే ఈ బ్లాక్ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ముప్పావుకిలో ( విత్ స్కిన్), నూనె – 4 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు -అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 4, మిరియాలు -ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, యాలకులు – 4, నల్ల యాలక్కాయ – 1, జాపత్రి – 1, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, నువ్వులు – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 8 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – రెండు ఇంచుల ముక్క, కొత్తిమీర – గుప్పెడు.
బ్లాక్ చికెన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఉల్లిపాయలకు గాట్లు పెట్టుకుని మంటపై కాల్చుకోవాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బలను, ఎండు కొబ్బరి ముక్కలను కూడా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలపై ఉండే పొట్టును తీసేసి ముక్కలుగా చేసిజార్ లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, కొత్తిమీర, అల్లం ముక్కలను కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాతకళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె కొంచెం వేడయ్యాక కారం, పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్,ఉప్పు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి మరో 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడివేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి చికెన్ ను మెత్తగా ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్లాక్ చికెన్ తయారవుతుంది. చికెన్ తో తరచూ ఒకేరకం వంటలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ ను కూడా ఇంట్లో అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు.