Boneless Chicken Curry : రెస్టారెంట్ల‌లో వండే బోన్‌లెస్ చికెన్ క‌ర్రీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!

Boneless Chicken Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల చికెన్ క‌ర్రీల‌ల్లో బోన్ లెస్ చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. బోన్ లెస్ చికెన్ తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచితో క్రీమీ టెక్చ‌ర్ తో ఈ కర్రీ చూడ‌డానికి తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ బోన్ లెస్ చికెన్ క‌ర్రీని అదే స్టైల్ లో అదే లుక్ తో మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే బోన్ లెస్ చికెన్ క‌ర్రీని అదే స్టైల్ లో ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బోన్ లెస్ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, బోన్ లెస్ చికెన్ – అర‌కిలో, ఉప్పు – కొద్దిగా, సాజీరా – పావు టీ స్పూన్, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, జీడిప‌ప్పు – 10, త‌రిగిన ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి- 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌కర్ర పొడి – అర టీ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Boneless Chicken Curry recipe in telugu very tasty with rice
Boneless Chicken Curry

బోన్ లెస్ చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో జీడిప‌ప్పు, ట‌మాటాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌లు, ఉప్పు వేసి వేయించాలి. చికెన్ లో ఉండే నీరంతా పోయి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువా ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే నూనెలో మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి పెరుగు వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత‌పెట్టి ఉడికించాలి. ఈ చికెన్ ను మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌రకు ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరి మెంతి, క్రీమ్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బోన్ లెస్ చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పుల్కా, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా రెస్టారెంట్ ల‌కు వెళ్లే ప‌ని లేకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts