Wifi Signal : ప్రస్తుత తరుణంలో చాలా బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు అత్యధిక స్పీడ్ కలిగిన ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. పోటీ పెరగడంతో చాలా తక్కువ ధరలకే మనకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ లభిస్తోంది. ఇక ఈ ఇంటర్నెట్‌కు గాను ఇంట్లో వైఫై రూటర్‌లను వాడుతుంటారు. అయితే ఎంత బ్రాండెడ్ కంపెనీ రూటర్ పెట్టినా వైఫై సిగ్నల్ సరిగ్గా ఉండడం లేదని కొందరు వాపోతుంటారు. కానీ కింద తెలిపిన చిన్న చిట్కాను పాటిస్తే వైఫై సిగ్నల్‌ను పెంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ అయిన కూల్ డ్రింక్ టిన్నులు రెండు తీసుకోవాలి. వాటిని పై భాగం కట్ చేయాలి. అనంతరం ఒక దగ్గర నిలువుగా కట్ చేయాలి. తరువాత ఫొటోలో చూపిన విధంగా కింది భాగాన్ని కొంత మేర ఉంచి కట్ చేయాలి. ఆ రెండు టిన్నులను వైఫై రూటర్‌కు ఉండే రెండు యాంటెన్నాలకు తగిలించాలి. దీంతో వైఫై సిగ్నల్ పెరుగుతుంది. నెట్ స్పీడ్ బాగా వస్తుంది.
అయితే ఇంట్లో అన్ని గదులకు సరిగ్గా మధ్యభాగంలో రూటర్‌ను పెడితే స్పీడ్ ఇంకా బాగా వస్తుంది. అలాగే రూటర్ కొద్దిగా ఎత్తులో ఉండేలా సెట్ చేయాలి. దీని వల్ల కూడా సిగ్నల్ మెరుగుపడుతుంది. ఈ విధంగా సూచనలు పాటిస్తే ఇంట్లో వైఫై సిగ్నల్ పెరుగుతుంది. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ కూడా వస్తుంది.