వార్త‌లు

మాంసాన్ని తినే బ్యాక్తీరియా వ‌ల్ల కాలు పోగొట్టుకున్న ఏపీ బాలుడు.. అస‌లు ఏమైంది..?

నెల రోజుల క్రితం, ఏపీలో బెజవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరద నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ముంపు ప్రాంతాలన్నీ మురుకుగా మారిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. చాలా మంది ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఈనెల మొదటి వారంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా భారీ సంఖ్యలో ఇళ్ళు నీట మునిగాయి. 12 ఏళ్ల బాలుడికి మాంసం తినే బ్యాక్టీరియా సోకింది. గాయాలు ఏమీ లేకుండా.. బాలుడు శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరడంపై వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. యూజీసీ బాలుడి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ డాట్, క్లబ్సియా జెర్మ్స్ కనుగొన్నారు.

ఏడవ తరగతి చదువుతున్న పావదీప్ అనే 12 ఏళ్ల బాలుడు ఇల్లు కూడా పూర్తిగా జలమయం అయ్యింది. వరద తగ్గుముఖం పట్టే దాకా కుటుంబ సభ్యులతో ఉన్నాడు. తర్వాత జ్వరం వచ్చింది. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మందులు ఇచ్చారు. కాళ్లలో వాపులు రావడంతో పాటుగా మూత్రం రావడంతో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు నెక్రో టైసింగ్ ఫాసిటిస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు తెలిపారు.

boy lost leg because of bacteria

ఈ వ్యాధికి ఇంకొక పేరు మాంసం తినే వ్యాధి. బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేశించే కండరాలని మాయం చేసిందని వైద్యులు తెలిపారు. 17వ తేదీన ఇన్ఫెక్షన్ ఎక్కువగా వ్యాపించకుండా ఉండడానికి, కుడి కాలుని తొడ దాకా తొలగించారు. ఎడమ మోకాలి కింద 30% కణజాలంలో క్రిములు సోకినట్లు గుర్తించారు. గాయాలు ఏమీ లేకుండా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా ప్రవేశించిందో తెలియ రాలేదు. ఎక్కువగా ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళలో సోకుతుంది. మురుగునీరు ఉండడం వలన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు.

Peddinti Sravya

Recent Posts