lifestyle

న్యూజిలాండ్‌ను వ‌దిలిపెట్టిపోతున్న ప్ర‌జ‌లు.. ఎందుకు..? ఏమైంది..?

చాలా మంది మన దేశాన్ని విడిచిపెట్టి మరో దేశంలో ఉంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఏమైనా పరిస్థితులు ఎదురైతే.. ఆ దేశాలని విడిచిపెట్టి, మరో చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో చాలా మంది ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు అలా జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. జింబాబ్వే, శ్రీలంక కొన్ని ఇతర దేశాలలానే న్యూజిలాండ్ కూడా పతనమంచున ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..? ఆ విషయం గురించి చూసేస్తే.. న్యూజిలాండ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్ని ఏళ్లుగా పెరుగుతున్న సమస్యలను తట్టుకోలేక అక్కడి వలసదారులతో పాటు, చాలామంది స్థానికులు దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు.

నిరుద్యోగం, వడ్డీ రేట్లు ఎక్కువ ఉండడం, ఆర్థిక అభివృద్ధి బలహీనపడిన కారణంగా ప్రజలు న్యూజిలాండ్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఈ వలసలు తాత్కాలిక ఉద్యోగులకే పరిమితం కాలేదు. న్యూజిలాండ్ పౌరులు కూడా ఆస్ట్రేలియాకు వలస వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అర్హులైన ప్రత్యేక కేటగిరీ వీసాతో ఆస్ట్రేలియాలో ఉద్యోగంతో పాటుగా పర్మినెంట్ గా ఉండడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు.

why people are leaving newzealand what is the reason

భారతీయులతో పాటుగా కొందరు స్థానికులు కూడా హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,31,200 మంది న్యూజిలాండ్ ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. 80 వేల 200 మంది న్యూజిలాండ్ పౌరులు వీళ్ళల్లో ఉన్నారు. ఓ ఏడాదిలో ఇంత అత్యధికంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన దాఖలాలు ఇంత దాకా ఎప్పుడూ నమోదు కాలేదు. అక్కడ ఆర్థిక వ్యవస్థ కారణంగా న్యూజిలాండ్ కి వెళ్లాలనుకునే విదేశీ పౌరుల సంఖ్య కూడా తగ్గుతోందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

Peddinti Sravya

Recent Posts