Bread Halwa : బ్రెడ్ హ‌ల్వాను ఇన్‌స్టంట్‌గా ఇలా 10 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Bread Halwa : బ్రెడ్ తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో బ్రెడ్ హ‌ల్వా కూడా ఒక‌టి. బ్రెడ్ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి చుట్టాలు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ హ‌ల్వాను త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉండే ఈ బ్రెడ్ హ‌ల్వాను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 7, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – త‌గిన‌న్ని, పంచ‌దార – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, పాలు – ఒక క‌ప్పు.

Bread Halwa recipe very tasty easy to make
Bread Halwa

బ్రెడ్ హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ కు చుట్టూ ఉండే న‌ల్ల‌టి భాగాన్ని తీసి వేయాలి. త‌రువాత బ్రెడ్ ను రెండు లేదా నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బ్రెడ్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగి జిగురుగా అయిన త‌రువాత బ్రెడ్ ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. బ్రెడ్ ముక్క‌లు పంచ‌దార పాకంలో నాని మెత్త‌గా అయిన త‌రువాత గంటెతో క‌లుపుకోవాలి.

వీటిని మెత్త‌గా చేసుకున్న త‌రువాత పాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. మ‌రో రెండు నిమిషాల పాటు దీనిని క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ హ‌ల్వా త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్ల‌లు కూడా దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు బ్రెడ్ తో రుచిగా హ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts