ఆధ్యాత్మికం

Pooja To God : టిఫిన్ తిని పూజ చేసుకోవచ్చా..? తప్పా..?

Pooja To God : ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి రోజూ పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, అనుకున్నవి జరుగుతాయని, కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతారు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అనే నియమం ఎప్పుడు కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుని పూజించడానికి అసలు సమయమే లేదు.

ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో కూడా పూజ చేసుకో వచ్చు. దానికి ఏమీ అడ్డు చెప్పలేదు భగవంతుడు. పైగా ఆహార విషయంలో కూడా ఎలాంటి నియమం లేదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యా వందనం చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజ కూడా చేసుకోవచ్చు. సంధ్యావందనం లేని వారు కూడా కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు.

can we do pooja after taking breakfast

అయితే కొంత మంది ఓపిక లేని వాళ్ళు, వయసు పైబడిన వారు టిఫిన్ తిని, ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవచ్చా లేదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. అయితే ఓపిక లేని వాళ్ళు, సంధ్యావందనం లేనివారు కొంచెం ఆహారాన్ని తీసుకొని పూజ చేసుకోవచ్చు.

ఈ రోజుల్లో చాలా మంది పలు సమస్యలతో బాధ పడుతున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉండి, ఓపికతో నిలబడలేని వారు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొంచెం ఏదైనా తిని భగవంతుడిని ఆరాధించవచ్చు. పూజ చేసేటప్పుడు నీరసం కలుగుతుంది అనుకునేవాళ్ళు పూజ చేయకపోవడం కూడా మంచిదే. ఒకవేళ కనుక ఓపిక లేని వాళ్ళు ఏమీ తినకుండా పూజ చేసుకుంటేనే భగవంతుడికి ఇష్టం. కాబట్టి కొంచెం అల్పాహారం తీసుకుని పూజ చేసుకోవచ్చు. అందులో ఏమీ తప్పు లేదు.

Admin

Recent Posts