Virat Kohli : విరాట్ కోహ్లికి అచ్చిరాని నాయ‌క‌త్వం.. ప్చ్‌.. ఏం చేస్తాం.. పాపం..!

Virat Kohli : దాదాపుగా దశాబ్ద‌కాలంగా భార‌త క్రికెట్ జ‌ట్టు బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2013 నుంచి 2021 వ‌ర‌కు కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్‌గా విధులు నిర్వ‌ర్తించాడు. అయితే ఈసారి మాత్రం అత‌ను కెప్టెన్సీ ప‌దవి నుంచి త‌ప్పుకున్నాడు. భార‌త జ‌ట్టుకు కూడా అత‌ను అన్ని ఫార్మాట్ల‌కు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుని కేవ‌లం బ్యాట్స్‌మ‌న్‌గానే కొన‌సాగుతున్నాడు. అయితే అత‌ను ఐపీఎల్‌లో అయినా ఆర్‌సీబీ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉంటాడు.. అనుకున్నారు. కానీ అత‌ను అందుకు కూడా గుడ్‌బై చెప్పి ఆ జ‌ట్టులోనూ కేవ‌లం బ్యాట్స్‌మన్‌గానే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లి నిర్ణ‌యంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు.

captaincy did not work well for Virat Kohli
Virat Kohli

ఇక ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లి త‌ప్పుకున్న త‌రువాత కొద్ది రోజుల‌కు.. అంటే తాజాగా.. ఆ జ‌ట్టుకు సౌతాఫ్రికా ప్లేయ‌ర్ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియ‌మించారు. దీంతో ఈ సీజ‌న్‌లో డుప్లెసిస్ బెంగ‌ళూరు జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇక గ‌త సీజ‌న్ల‌లో డుప్లెసిస్ చెన్నై త‌ర‌ఫున బ్యాట్స్‌మ‌న్‌గా ఆడి అనేక విజ‌యాల‌ను ఆ టీమ్‌కు అందించాడు. కానీ ఈసారి మెగా వేలంలో అత‌న్ని చెన్నై కొనుగోలు చేయ‌లేదు. దీంతో అత‌న్ని అదృష్టం బెంగ‌ళూరు రూపంలో వ‌రించింది. అత‌న్ని ఆ జ‌ట్టు రూ.7 కోట్ల‌కు సొంతం చేసుకుంది. అలాగే తాజాగా కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను కూడా క‌ట్ట‌బెట్టింది. అయితే ఈ సంగతి అలా ఉంచితే.. కోహ్లి అనూహ్యంగా బెంగ‌ళూరు కెప్టెన్‌గా ఎందుకు త‌ప్పుకున్నాడు ? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

భార‌త జ‌ట్టు అంటే వేరే. కానీ ఐపీఎల్‌కు అత‌నిపై ఒత్తిడి ఏమీలేదు. ఇన్నేళ్ల నుంచి బెంగ‌ళూరు ట్రోఫీని సాధించ‌లేద‌న్న మాటేగానీ.. దాదాపు అంత ప‌నీ చేసింది. అనేక సీజ‌న్ల‌లో ప్లే ఆఫ్స్‌కు, ఫైన‌ల్స్‌కు చేరి ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు గ‌ట్టి పోటీనిచ్చింది. అయితే జ‌ట్టు నిర్ణ‌య‌మో మ‌రో విష‌య‌మో కానీ కోహ్లి బెంగ‌ళూరు కెప్టెన్‌గా త‌ప్పుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. అయితే దీనిపై తాజాగా ఆ జ‌ట్టు డైరెక్ట‌ర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్స‌న్ స్పందించారు. కోహ్లి కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డం అనేది అతని సొంత నిర్ణ‌య‌మ‌ని, ఇందులో ఎవ‌రి బ‌ల‌వంతం లేద‌ని స్ప‌ష్టం చేశారు. కోహ్లి త‌న‌కు రెస్ట్ కావాల‌ని అడిగాడ‌ని.. బ్యాట్స్‌మ‌న్ గా కొన‌సాగుతా.. అని చెప్పాడ‌ని.. అందుక‌నే అత‌ని నిర్ణ‌యానికి గౌర‌వం ఇచ్చామ‌ని తెలిపారు.

అయితే ఐపీఎల్‌లో వాస్త‌వానికి కోహ్లికి ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ ఒక్క‌సారి కూడా జ‌ట్టుకు ట్రోఫీని అందించ‌లేక‌పోయాడు. దీనిపై టీమ్ ఒత్తిడి లేకున్నా.. ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్‌ల‌లో క‌చ్చితంగా జ‌ట్టు మేనేజ్‌మెంట్ స‌క్సెస్‌ను ఆశిస్తుంది. క‌నుక స‌హ‌జంగానే కెప్టెన్‌పై ఒత్తిడి ఏర్ప‌డుతుంది. స‌రిగ్గా ఇదే కోహ్లి విష‌యంలో జ‌రిగిన‌ట్లు స్పష్ట‌మ‌వుతుంది. అందుకనే అత‌ను రాజీనామా చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఏది ఏమైనా.. కోహ్లి క్రికెట్ కెరీర్‌లో అన్నీ మాయ‌ని మ‌చ్చ‌లే ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో కెప్టెన్‌గా భార‌త్‌కు ట్రోఫీల‌ను అందించ‌లేక‌పోయాడు. ఐపీఎల్‌లో బెంగ‌ళూరుకు అదే జ‌రిగింది. దీంతో కోహ్లి మ‌న‌స్థాపంతోనే బెంగ‌ళూరు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి బ్యాట్స్‌మ‌న్‌గా ఉన్న కోహ్లి భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో చూడాలి.

Share
Editor

Recent Posts