Carrot Pachadi : కూర‌లేమీ లేన‌ప్పుడు ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Carrot Pachadi : క్యారెట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌ప‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. క్యారెట్ ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. క్యారెట్ ను నేరుగా తిన‌డంతో పాటు వంట‌ల్లో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ క్యారెట్ తో మ‌నం రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్స్ ఉంటే చాలు ఇన్ స్టాంట్ గా ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. వంట ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు ఈ క్యారెట్ ప‌చ్చ‌డితో చ‌క్క‌గా భోజ‌నం చేయ‌వ‌చ్చు. క్యారెట్ తో ఇన్ స్టాంట్ గా రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన క్యారెట్ తురుము – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – 2 టీ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 15, పెద్ద నిమ్మ‌కాయ – 1, నూనె – 4 టేబుల్ స్పూన్స్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్.

Carrot Pachadi recipe in telugu make in this way
Carrot Pachadi

క్యారెట్ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఆవాలు, మెంతులు వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత గిన్నెలో క్యారెట్ తురుమును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న ఆవ పిండి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి అంతా క‌లిసేలా చ‌క్క‌గా క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ తాళింపును ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా నిమ్మ‌ర‌సం వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి.

ఇలా చేయడం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడివేడి అన్నం నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయ‌డం వల్ల వారం నుండి ప‌ది రోజుల పాటు తాజాగా ఉంటుంది. క్యారెట్ తో ఈ విధంగా ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts