Mango Varieties : మామిడి పండ్లలో ఈ వెరైటీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. త‌ప్ప‌క ట్రై చేయాల్సిందే..!

Mango Varieties : మామిడి పండ్లు.. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు. మామిడి పండ్ల‌ను కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తూ ఉంటారు. ప్ర‌పంచంలోనే భార‌త దేశం మామిడి పండ్ల‌ను అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేస్తుంది. మామిడి పండ్ల‌ల్లో దాదాపు వెయ్యి ర‌కాలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మామిడి పండు ప్ర‌సిద్ది చెందింది. మామిడి పండ్లు కేవ‌లం రుచిగా ఉండ‌డ‌మే కాదు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మామిడి పండ్ల‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. ఒక్కో ర‌కం పండుఒక్కో రుచిని, వాస‌న‌ను అలాగే వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి.

కొన్ని ప్ర‌సిద్ది చెందిన మామిడి పండ్ల ర‌కాల గురించి అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స‌పేదా, బాదామి, బైంగ‌న్ ప‌ల్లి. ఇవి ఆంధ్ర‌ప్ర‌దేశ‌, తెలంగాణా, కేర‌ళ రాష్ల్రాల‌లో ప్ర‌సిద్ది చెందిన‌వి. ఇవి చాలా రుచిగా, జ్యూసీగా ఉంటాయి. అలాగే వీటిలో పీచు కూడా త‌క్కువ‌గా ఉంటుంది. వీటిపై చ‌ర్మం ప‌లుచ‌గా ఉంటుంది. జ్యూస్ లు, మిల్క్ షేక్స్, డిస‌ర్ట్స్ వంటి వాటిని త‌యారు చేసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ మామిడి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. వీటిలో ఉండే పొటాషియం ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Mango Varieties you must try these
Mango Varieties

కేస‌రి మామిడి పండ్లు.. ఇవి ఎక్కువ‌గా గుజ‌రాత్, మ‌హారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ల‌భిస్తాయి. ఇవి అధిక ధ‌ర‌ల‌ను క‌లిగి ఉంటాయి. ఈ పండ్లు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. పైన ఆకుప‌చ్చ రంగులో ఉంటుంది. లోప‌ల గుజ్జు కుంకుమ పువ్వు రంగులో ఉంటుంది. మామిడి పండ్ల ర‌సాన్ని చేయ‌డంలో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటిని మామిడి పండ్ల‌కు రాణిగా వ్య‌వరిస్తూ ఉంటారు. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ద‌శేరి మామిడి పండ్లు.. ఇవి ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మహిలాబాద్ ప్రాంతంలో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిలో ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉంటుంది. ఆక‌ట్టుకునే సువాస‌న‌, ఆహ్లాద‌క‌ర‌మైన రుచిని క‌లిగి ఉంటాయి. ఈ పండ్లు మ‌ధ్య‌స్థంగా ఉంటే చ‌ర్మాన్ని, ప‌సుపు ఆకుప‌చ్చ రంగుల‌ను క‌లిగి ఉంటుంది. మ‌ధుమేహం, క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులను త‌గ్గించ‌డంలో ఈ మామిడి పండ్లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఈ పండ్లు యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి.

తోతాప‌రి మామిడి పండ్లు.. ఇవి కొద్దిగా పుల్ల‌గా ఉంటాయి. అలాగే ఈ పండ్లు కొద్దిగా పొడుగ్గా ఉంటాయి. ఎక్కువ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని చిత్తురలో ల‌భిస్తాయి. ఈ పండ్లు కొద్దిగా పుల్ల‌గా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా మామిడి ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డంలో ఉప‌యోగిస్తూ ఉంటారు. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.
సింధూరి మామిడి పండ్లు…. ఇవి ఎక్కువ‌గా కేర‌ళ మ‌రియు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ల‌భిస్తూ ఉంటాయి. తియ్య‌గా, జ్యూసీగా ఉండడంతో పాటు చ‌క్క‌టి వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటాయి. ఇవి ఎక్కువ‌గా మే, జూన్ నెల‌లల్లో ల‌భిస్తాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ప్రేగుల క‌ద‌లిక‌ల‌ను పెంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలోదోహ‌ద‌ప‌డ‌తాయి.

ఆల్ఫాన్ సోస్.. ఇవి ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లో ల‌భిస్తాయి. ఇవి మామిడి పండ్ల‌ల‌ల్లో అన్నింటి కంటే రుచిగా ఉంటాయి. అలాగే అధిక ధ‌ర‌ల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ఎరుపు మ‌రియు ప‌సుపు రంగు క‌లిగి ఉంటాయి. ఐస్ క్రీమ్స్, జ్యూస్, పుడ్డింగ్ వంటి త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవే కాకుండా మామిడి పండ్లల్లో చాలా ర‌కాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

D

Recent Posts