technology

మీ ఫోన్‌లో వెంట‌నే ఈ 5 సెట్టింగ్స్‌ను మార్చుకోండి

స్మార్ట్ ఫోన్స్ లో ఎన్నో రకాల సెట్టింగ్స్ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మొదటి నుండే ఆన్ లో ఉంటాయి. కాకపొతే చాలా మంది యూజర్లకు ఈ విషయం తెలియదు. ఎప్పుడూ కూడా స్మార్ట్ ఫోన్స్ లో లొకేషన్ హిస్టరీను ఆన్ చేసి ఉంచకూడదు. ఇది యాక్టివ్ గా ఉంటే గూగుల్ మీ యాక్టివిటీస్ మరియు ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఫోనుకు హోటల్స్, క్లబ్స్, షాపింగ్ మాల్స్ గురించి సమాచారం వస్తూ ఉంటాయి. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ కి సంబందించిన సమాచారం లొకేషన్ హిస్టరీ ద్వారా వస్తుంది అని చెప్పవచ్చు.

కాబట్టి దీన్ని ఎప్పుడు ఆఫ్ లో ఉంచుకోండి. డేటా అండ్ ప్రైవసీ సెక్షన్ ఎప్పుడు కూడా ఆఫ్ లో ఉండాలి లేకపోతే మీ సమాచారం ని ఇతరులకు ఇస్తున్నట్టే. నియర్ బై డివైజెస్ ఆప్షన్ ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్స్ లో ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఆఫ్ లో ఉంచాలి. దీన్ని ఆన్ చేయడం తో ఎవరైనా మీ స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ అవ్వవచ్చు. లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్ ను ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకోవాలి.

change these 5 settings in your phone immediately

మెసేజెస్ లేక మెయిల్స్ లాక్ స్క్రీన్ లో కనిపించడం వలన ఎవరైనా దాన్ని చూడగలరు. కాబట్టి దీన్ని డిసేబుల్ చేసుకుంటేనే మేలు. పర్సనలైజ్డ్ యాడ్స్ ను ఎప్పుడు డిజేబుల్ చేసుకుంటే మేలు. ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ ను మొత్తం ఇస్తున్నట్టే గూగుల్ సమాచారాన్ని అందిస్తుంది కాబట్టి దీనిని కూడా డిజేబుల్ చేయాలి.

Peddinti Sravya

Recent Posts