information

సీనియర్ సిటిజ‌న్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన భార‌తీయ రైల్వే.. వారికి ఉచిత సౌక‌ర్యాలు..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ అయిన రైల్వే ఎప్పటిక‌ప్పుడు ప్ర‌యాణికుల కోసం అనేక ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పిస్తుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. రైలు టికెట్‌ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైలులో ప్రయాణించే వరకు భార‌తీయ రైల్వే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం 60 ఏళ్లు నిండిన మగవాళ్లను, 58 ఏళ్లు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్స్‌గా పరిగణిస్తారు. వీళ్లకు సంబంధించిన కేరింగ్ బాధ్యతలను రైల్వే తీసుకుంటుంది.దేశంలో దాదాపు చాలా రైళ్లలో రిజర్వ్‌డ్, అన్‌ రిజర్వ్‌డ్‌ కోచ్‌లు ఉంటాయి. వాటిల్లో మూడు రకాల బెర్త్‌లు ఉంటాయి. లోయర్‌, మిడిల్‌, అప్పర్ బెర్తులు ఉంటాయి.

రిజర్వేషన్ సమయంలో సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్తును ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. ప్రయారిటీ బేసిస్‌లో సీనియర్ సిటిజన్స్‌కు లోయర్ బెర్తును కేటాయిస్తారు. అదే మహిళల విషయంలో ఐతే 45 ఏళ్లు నిండిన వాళ్లకు లోయర్‌ బెర్తు పొందే అవకాశం ఉంది. మూవింగ్ ట్రైన్‌లో అయితే ఖాళీ అయ్యే లోయర్‌ బెర్తుపై తొలి హక్కు సీనియర్‌ సిటిజన్లకే ఉంటుంది. ఒక వేళ రిజర్వేషన్ సమయంలో లోయర్ బెర్తు లేకుంటే ప్రయాణ సమయంలో ఏ స్జేజ్‌లో అయినా రైలులో లోయర్‌ బెర్తు ఖాళీ అయితే ముందుగా అది సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కే కేటాయించ‌డం జ‌రుగుతుంది. ఒక వేళ రైలు ప్రారంభమయ్యే స‌మ‌యానికి లోయర్ బెర్తు ఖాళీగా ఉంటే అప్పుడు కూడా అప్పర్‌ మిడిల్ బెర్తుల్లో ఉన్న సీనియర్ సిటిజన్లు ఆ బెర్తు పొందేలా ఇండియన్ రైల్వే రూల్స్ ఉపయుక్తంగా ఉన్నాయి.

indian railways giving these free facilities to senior citizen

ఇండియన్ రైల్వేలో ఉన్న ప్రతి టైన్‌లోని రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో కొన్ని బెర్తులు సీనియర్ సిటిజన్స్‌ కోసం రిజర్వ్‌డ్‌ చేసి ఉంచారు. స్లీపర్ కోచ్లలో ఐతే ఆరు బెర్తులు, ఏసీ 3 టైర్‌, ఏసీ టూ టైర్‌లో మూడేసి బెర్త్‌లను రిజర్వ్ చేసి ఉంచుతారు. అయితే అవసరాన్ని బట్టి ఈ సీట్లను 45 ఏళ్లు నిండిన మహిళలకు, గర్భిణులకు కేటాయిస్తుంటారు. లోకల్‌ రైళ్లు మెట్రో ట్రైన్‌లలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి మెట్రో నగరాల్లో సీనియర్ సిటిజ‌న్స్ ప్ర‌త్యేక స‌దుపాయాలు పొంద‌వ‌చ్చు. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రెన్‌ రైల్వేల కింద నడిచే లోకల్‌ రైళ్లలో ఈ రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది. నిర్ణీత మొత్తంలో చెల్లించి వారు ఈ స‌దుపాయాలు పొందే అవ‌కాశం ఉంటుంది.

Sam

Recent Posts