Chicken Leg Piece Fry : చికెన్ లెగ్ పీస్‌ల‌ను ఇలా ఫ్రై చేయాలి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Chicken Leg Piece Fry : మ‌నం చికెన్ లెగ్ పీసెస్ తో ర‌క‌ర‌కాల వంట‌కాలు త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ లెగ్ పీసెస్ తో త‌యారు చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ లెగ్ పీసెస్ ను ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. ఈ చికెన్ లెగ్ పీసెస్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఫ్రైకు కూడా ఒక‌టి. లెగ్ పీసెస్ తో చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. త‌క్కువ నూనెలో, రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చికెన్ లెగ్ పీస్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ లెగ్ పీస్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ లెగ్ పీసెస్ – 6, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, మైదాపిండి – ఒక‌ టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, పెరుగు – పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ట‌మాట సాస్ – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, నూనె – అర క‌ప్పు.

Chicken Leg Piece Fry recipe in telugu make in this way
Chicken Leg Piece Fry

చికెన్ లెగ్ పీస్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ను శుభ్రంగా క‌డిగి గాట్లు పెట్టుకోవాలి. త‌రువాత వాటిని ఒక కుక్కర్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో త‌గిన‌న్ని నీళ్లు, ఒక టీ స్పూన్ ఉప్పు, వెనిగ‌ర్ వేయాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ముక్క‌ల‌ను తీసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లపాలి. త‌రువాత అందులో ఉడికించిన లెగ్ పీసెస్ ను వేసి ముక్క‌ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి 2 గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి.

అవ‌స‌ర‌మైతే మ‌రికొద్దిగా నూనెను వేసుకుంటూ ఎర్ర‌గా, క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని ఉల్లిపాయ‌, నిమ్మ‌ర‌సం, గ్రీన్ చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా వీటిని తిన‌వ‌చ్చు. చికెన్ లెగ్ పీసెస్ తో చేసిన ఈ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts