Chicken Tikka Dum Biryani : చికెన్ టిక్కా ద‌మ్ బిర్యానీ.. ఇలా చేశారంటే హోట‌ల్ స్టైల్‌లో వ‌స్తుంది..!

Chicken Tikka Dum Biryani : చికెన్ బిర్యానీ.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ బిర్యానీని మ‌నం వివిధ రుచుల్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల బిర్యానీల‌ల్లో చికెన్ టిక్కా ధ‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ చికెన్ టిక్కా ధ‌మ్ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ టిక్కా ధ‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ టిక్కా ధ‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

నెయ్యి – 1/3 క‌ప్పు, పుదీనా త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, కుంకుమ పువ్వు నీళ్లు – ఒక టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్, పాలు – అర క‌ప్పు.

Chicken Tikka Dum Biryani recipe in telugu make in this way
Chicken Tikka Dum Biryani

మ్యారినేట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – అరకిలో, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, తియ్య‌టి పెరుగు – అర‌కిలో, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ఆవ నూనె – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, శొంఠి పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – రెండు క‌ప్పులు,నీళ్లు – రెండు లీట‌ర్లు, ల‌వంగాలు – 6, బిర్యానీ ఆకు – 1, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, సాజీరా – ఒక టీ స్పూన్, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, అనాస పువ్వులు – 2,జాపత్రి- 1, న‌ల్ల యాల‌కులు – 2, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

చికెన్ టిక్కా ధ‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిని అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేట్ కు కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక మ్యారినేట్ చేసుకున్న ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. వీటిని 20 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి కేవ‌లం ముక్క‌ల‌ను మాత్ర‌మే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద స్టాండ్ ను ఉంచి దానిపై చికెన్ ముక్క‌ల‌ను ఉంచాలి.

ఈ ముక్క‌ల‌ను అన్ని వైపులా న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత గిన్నెలో రెండు లీట‌ర్ల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాల్నీ వేసి నీటిని బాగా మ‌రిగించాలి.నీరు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యం వేసి క‌ల‌పాలి. దీనిని 60 శాతం వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ఈ బియ్యాన్ని రెండు లేయ‌ర్లుగా వేసుకోవాలి. ముందుగా స‌గం బియ్యాన్ని బిర్యానీ గిన్నెలో వేయాలి. మిగిలిన బియ్యాన్ని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి వేసుకోవాలి. త‌రువాత అన్నాన్ని స‌మానంగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై 100 ఎమ్ ఎల్ నెయ్యి, కుంకుము పువ్వు నీళ్లు, ఫ్రైడ్ ఆనియ‌న్స్, పుదీనా, కొత్తిమీర, పాలు చ‌ల్లుకోవాలి. త‌రువాత కాల్చుకున్న చికెన్ ముక్క‌ల‌ను వేసుకోవాలి. ఇప్పుడు గిన్నె అంచుల వెంబ‌డి పిండిని ఉంచి మూత పెట్టాలి.

ఈ బిర్యానీని 8 నిమిషాల పాటు పెద్ద‌ మంట‌పై, 7 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 20 నిమిషాల పాటు ఉంచి ఆ త‌రువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా ధ‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని రైతా, మిర్చి కా సాల‌న్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా చికెన్ తో టిక్కా ధ‌మ్ బిర్యానీని త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts