Chilli Paneer : రెస్టారెంట్ స్టైల్‌లో చిల్లీ ప‌నీర్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Chilli Paneer : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో చిల్లీ ప‌నీర్ కూడా ఒక‌టి. చిల్లీ ప‌నీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్నాక్స్ గా తిన‌డానికి, స్టాట‌ర్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ చిల్లీ ప‌నీర్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లో ప‌నీర్ ఉంటే చాలు ఈ వంట‌కాన్ని నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ ప‌నీర్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిల్లీ ప‌నీర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్ – 200 గ్రా., ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Chilli Paneer recipe in telugu make in this method
Chilli Paneer

టాసింగ్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, పెటల్స్ లాగా త‌రిగిన ఉల్లిపాయ – 1, పెట‌ల్స్ లాగా త‌రిగిన క్యాప్సికం – 1, పంచ‌దార – పావు టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, ట‌మాట కిచ‌ప్- ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్.

చిల్లీ ప‌నీర్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో ప‌నీల‌ర్ ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత కార్న్ ఫ్లోర్ వేసి క‌ల‌పాలి. పిండి ముక్క‌ల‌కు ప‌ట్టేలా కొద్ది కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌నీర్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు, ప‌చ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి మెత్త‌బ‌డిన త‌రువాత పంచ‌దార‌, వెనిగ‌ర్, సోయాసాస్, చిల్లీ సాస్, ట‌మాట కిచ‌ప్ వేసి క‌ల‌పాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత కార్న్ ఫ్లోర్ ను నీటిలో క‌లిపి వేసుకోవాలి. వీటిని మ‌రో నిమిషం పాటు ఉడికించిన త‌రువాత ప‌నీర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిని ద‌గ్గ‌ర‌ప‌డే వ‌ర‌కు వేయించి పైన స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిల్లీ పనీర్ త‌యార‌వుతుంది. ఈ విధంగా ఇంట్లోనే ప‌నీర్ తో ఈ రుచిక‌ర‌మైన వంట‌కాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన చిల్లీ ప‌నీర్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts