Aloo Methi Fry : ఆలూ మేథి ఫ్రై.. బంగాళాదుంప ముక్కలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. బంగాళాదుంపలు, మెంతికూర కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే తక్కువ నూనెతో చేసే ఈ ఫ్రైను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ ఫ్రైను చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఆలూ మేథి ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మేథీ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన మెంతికూర – 2 కట్టలు, తరిగిన బంగాళాదుంపలు – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 6, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
ఆలూ మేథీ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. వీటిని మూడు నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలపై మూత పెట్టి అందులో నీటిని పోసి వేయించాలి.
ఈ బంగాళాదుంప ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు వేయించాలి. బంగాళాదుంప ముక్కలు వేగిన తరువాత మెంతికూర వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మెంతికూర పూర్తిగా మగ్గే వరకు వేయించాలి. మెంతికూర మగ్గిన తరువాత అంతా మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మేథి ప్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఈ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.