Chocolate Milk Shake : చాక్లెట్ మిల్క్ షేక్.. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వీటిని ఎక్కువగా అధిక ధరలకు బయట కొనుగోలు మరీ తాగుతూ ఉంటాము. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇకపై బయట కొనుగోలు చేసే అవసరం లేకుండా మన ఇంట్లోనే మనకు సులభంగా లభించే పదార్థాలతో ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ ను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే చల్ల చల్లగా చాక్లెట్ మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, పంచదార – 2 టేబుల్ స్పూన్స్, కొకొ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, చాక్లెట్ కేక్ – 2 టేబుల్ స్పూన్స్, వెనీలా ఐస్ క్రీమ్ – 2 స్కూబ్స్.
చాక్లెట్ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా పాలను కాచి చల్లార్చి ఫ్రిజ్ లో ఉంచాలి. పాలు చల్లగా అయిన తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార, కొకో పౌడర్, చాక్లెట్ కేక్, వెనీలా ఐస్ క్రీమ్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని ఒక గ్లాస్ లో పోసి పైన చాకో చిప్స్, తురిమిన చాక్లెట్, కలర్ ఫుల్ స్ప్రింకిల్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చల్ల చల్లగా ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే మిల్క్ షేక్ ను తయారు చేసుకుని తాగవచ్చు.