Chole Palak Curry : ధాబాల‌లో ల‌భించే శ‌న‌గ‌ల క‌ర్రీని ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Chole Palak Curry : మ‌న‌కు ధాబాల‌లో, రెస్టారెంట్ ల‌లో ల‌భించే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఛోలే పాల‌క్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. పాల‌కూర‌, కాబూలీ శ‌న‌గ‌లు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నాన్, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేయ‌వ‌చ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఛోలే పాల‌క్ కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛోలే పాల‌క్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కాబూలీ శ‌న‌గ‌లు – ఒక క‌ప్పు, పాల‌కూర – ఒక పెద్ద క‌ట్ట‌, నూనె- 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు- త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 3, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, గ‌రంమ‌సాలా – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chole Palak Curry recipe in telugu very tasty with chapatis
Chole Palak Curry

ఛోలే పాల‌క్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత పాల‌కూర‌, ప‌చ్చిమిర్చి వేసి మూత పెట్టి మ‌గ్గించాలి. పాల‌కూర మెత్త‌గా మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పాల‌కూర వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి.

దీనిని ఒక నిమిషం పాటు ఉడికించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ట‌మ‌ట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. టమాట ముక్క‌లు ఉడికిన త‌రువాత ఉడికించిన శ‌న‌గ‌లు వేసిక‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఛోలే పాల‌క్ క‌ర్రీ తయార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఛోలే పాల‌క్ కర్రీని త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts