Chukka Kura Pappu : చుక్క‌కూర ప‌ప్పు త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Chukka Kura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో చుక్క కూర కూడా ఒక‌టి. ఇత‌ర ఆకుకూర‌ల వ‌లె చుక్క కూర కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. చాలా మంది చుక్క‌కూర‌ను ఇష్టంగా తింటారు. దీనితో ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చుక్క కూర‌తో రుచిగా ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చుక్క కూర పప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన చుక్క కూర – 5 క‌ట్ట‌లు, కందిప‌ప్పు – 150 గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుస‌లు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఇంగువ – పావు టీ స్పూన్.

Chukka Kura Pappu recipe in telugu how to cook it
Chukka Kura Pappu

చుక్క కూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులో చుక్క‌కూర‌, ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, ఒక గ్లాస్ నీళ్లను పోసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ పై మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఇంగువ వేసి క‌ల‌పాలి.

తాళింపు వేగిన త‌రువాత ఉడికించుకున్న ప‌ప్పును వేసి క‌ల‌పాలి. ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చుక్క‌కూర పప్పు త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ప‌ప్పును చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా చుక్క‌కూర‌తో ప‌ప్పును త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts