Crispy Chicken Legs : నూనె పీల్చ‌కుండా క్రిస్పీగా చికెన్ లెగ్స్‌ను ఇలా ఫ్రై చేయండి..!

Crispy Chicken Legs : మ‌నం చికెన్ లెగ్ పీసెస్ తో కూడా వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ లెగ్ పీసెస్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో లెగ్ పీస్ ఫ్రై కూడా ఒక‌టి. కింద చెప్పిన‌ట్టుగా చేసే ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోప‌ల జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్ లో,స్పెష‌ల్ డేస్ లో ఇలా చికెన్ లెగ్ పీసెస్ తో ఫ్రై చేసి తీసుకోవ‌చ్చు. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి కూడా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ లెగ్ పీస్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఫుడ్ క‌ల‌ర్ – కొద్దిగా.

Crispy Chicken Legs recipe in telugu very tasty make like this
Crispy Chicken Legs

చికెన్ మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ లెగ్ పీసెస్ – 5, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

చికెన్ లెగ్ పీస్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లెగ్ పీసెస్ కు గాట్లు పెట్టి తీసుకోవాలి. త‌రువాత మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఇందులో నూనె, బియ్యంపిండి, మైదాపిండి, ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీటిని చల్లుకుంటూ పిండి ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి మ‌రో అర‌గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక లెగ్ పీసెస్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ 7 నుండి 8 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఈ లెగ్ పీసెస్ ను బ‌య‌ట‌కు తీసి మ‌ర‌లా నూనెను బాగా వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌ర‌లా లెగ్ పీసెస్ ను వేసి మ‌రో 2 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts