Reverse Walking Benefits : ఆరోగ్యం పట్ల ప్రస్తుత తరుణంలో చాలా మంది శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల జాగ్రత్తలను పాటిస్తున్నారు. అందులో భాగంగానే పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తున్నారు. అయితే వ్యాయామం విషయానికి వస్తే చాలా మంది చేసే వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒకటి. ఇందుకు గాను ఎలాంటి ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఎవరైనా, ఎప్పుడైనా తేలిగ్గా ఈ వ్యాయామం చేయవచ్చు. పైగా వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే వాకింగ్ సరే.. కానీ వెనక్కి నడవడం వల్ల కూడా లాభాలు కలుగుతాయని మీకు తెలుసా.. అవును, ఈ విధంగా రివర్స్ వాకింగ్ చేసినా కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రివర్స్ వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల కాళ్లలో ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడేవారు ఈ విధంగా వెనక్కి నడవడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల శరీర బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. తూలిపోయే సమస్య ఉన్నవారు, నడక సమస్య ఉన్నవారు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
సాధారణ వాకింగ్ కన్నా వెనక్కి నడవడం వల్లే కొవ్వు వేగంగా కరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రివర్స్ వాకింగ్ వల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి రివర్స్ వాకింగ్ ఎంతగానో మేలు చేస్తుందని వారంటున్నారు. వెనక్కి నడవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
వెనక్కి నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు ఉన్నవారు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే వెన్ను నొప్పి సమస్య ఉన్నవారు కూడా ఇలా వెనక్కి నడవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక రివర్స్ వాకింగ్ ను ప్రాక్టీస్ చేసి చూడండి. దీంతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.