food

Jowar Idli Recipe : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తినాల్సిన జొన్న ఇడ్లీలు.. త‌యారీ ఇలా..!

Jowar Idli Recipe : చాలామంది, జొన్న పిండిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. జొన్న పిండి వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా, మధుమేహం ఉన్నవాళ్లు, జొన్న పిండితో చేసిన ఇడ్లీలు తీసుకుంటే, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఉదయం అల్పాహారం సమయంలో, జొన్న పిండి తో తయారు చేసుకున్న ఇడ్లీలు తీసుకోవడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే, మరీ మంచిది.

మరి ఈ జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న పిండి ఇడ్లీలని తయారు చేసుకోవడానికి, ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు రవ్వ, ఒకటిన్నర కప్పు పెరుగు, కొత్తిమీర తరుగు, ఒక చెంచా జీడిపప్పు, కొంచెం వంట సోడా, రెండు చెంచాల నూనె, అర చెంచా ఆవాలు, అర చించా మినప్పప్పు, మూడు పచ్చిమిరప కాయలు, ఒక కరివేపాకు రెబ్బ, చిటికెడు ఇంగువ.

diabetic patients must take these jowar idli

దీని కోసం ముందు ఒక గిన్నె లో రవ్వ, జొన్న పిండి, ఉప్పు, పెరుగు, నీళ్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండిని అరగంట నుండి 40 నిమిషాల పాటు వదిలేయండి. ఒక చిన్న కడాయి పెట్టుకుని, నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందాక పెట్టుకున్న పిండి మిశ్రమంలో, ఈ తాలింపు వేసుకోవాలి.

పిండి గట్టిగా అనిపిస్తే, కొంచెం నీళ్లు పోసుకోండి. ఇప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకుని, ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీలు లాగా ఈ పిండిని వేసుకోవాలి. ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడకపెట్టుకొని, బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా, జొన్న ఇడ్లీలని తయారు చేసుకోవచ్చు.

Admin

Recent Posts