Disha Patani : బాలీవుడ్‌లో అందాల ఆరబోత అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. దిశా పటాని. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ భామ సినిమాల్లోకి రాక ముందు మోడల్‌గా ఉండేది. ఇప్పుడు కూడా ఆ ఫీల్డ్‌లో ఉంటూనే.. మరోవైపు సినిమాలు చేస్తోంది. ఇక పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఈమె ఆయా బ్రాండ్స్‌కు చెందిన దుస్తులను ధరిస్తూ.. గ్లామర్ షో చేస్తుంటుంది. దీంతోపాటు అప్పుడప్పుడు బికినీలను ధరిస్తూ అలరిస్తుంటుంది.
ఇక తాజాగా దిశా పటాని మరోమారు బికినీ ధరించి అలరించింది. క్రీమ్ కలర్‌లో ఉండే బికినీ ధరించిన ఈమె అందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.
కాగా సినిమాల విషయానికి వస్తే.. దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్, యోధా, కెటినా అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. తెలుగులోనూ ఈమె నటించింది. 2015లో లోఫర్ అనే సినిమాతో ఈమె వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఆమెకు అడపా దడపా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.