DMart : హైదరాబాద్ నగరంలోని హైదర్‌నగర్ అనే ప్రాంతంలో ఉన్న డిమార్ట్ ఔట్‌లెట్‌కు కన్‌జ్యూమర్ డిస్‌ప్యూట్స్ రెడ్రస్సల్ కమిషన్ (సీడీఆర్‌సీ) ఫైన్ విధించింది. ఓ కస్టమర్ నుంచి క్యారీ బ్యాగులకు గాను డబ్బులు వసూలు చేసినందుకు జరిమానా విధించారు.
మే 2019లో ఆకాష్ కుమార్ అనే వ్యక్తి సదరు డిమార్ట్ ఔట్‌లెట్‌లో రూ.602 పెట్టి సరుకులు కొన్నాడు. అందుకు గాను క్యారీ బ్యాగ్‌ను రూ.3.50 పెట్టి కొనుగోలు చేశాడు. అయితే రూల్స్ ప్రకారం.. క్యారీ బ్యాగులకు డబ్బును వసూలు చేస్తే.. అలాంటి బ్యాగ్‌లపై కంపెనీకి చెందిన లోగోలు ఉండరాదు. లోగోలు ఉంటే.. ఆ బ్యాగులను ఉచితంగానే కస్టమర్లకు అందించాలి. కానీ డిమార్ట్ వారు అతని నుంచి ఒక బ్యాగ్‌కు రూ.3.50 వసూలు చేశారు. దీంతో ఆకాష్ ఇదే విషయంపై ఆ కమిషన్‌ను ఆశ్రయించాడు.
ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలను విన్న కమిషన్ ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యారీ బ్యాగ్‌పై లోగో ఉన్నందున డిమార్ట్ ఆ బ్యాగ్‌ను ఉచితంగానే ఇవ్వాల్సి ఉందని, కానీ వారు దానికి రూ.3.50 వసూలు చేశారు కాబట్టి ఆ మొత్తాన్ని వినియోగదారుడికి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది.
అలాగే ఆకాష్‌కు రూ.1000 నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. ఆ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించకపోతే 18 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని తెలియజేసింది. అయితే డిమార్ట్‌కు ఇలా ఫైన్ పడడం ఇదేమీ కొత్త కాదు.
గతంలో హైదర్‌గూడలోని ఔట్‌లెట్‌కు కూడా ఇలాగే రూ.50వేల జరిమానా విధించారు. అప్పుడు కూడా ఓ కస్టమర్ నుంచి సదరు ఔట్‌లెట్ వారు లోగో ప్రింట్ చేయబడి ఉన్న క్యారీ బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేశారు. దీంతో ఆ విషయంలోనూ డిమార్ట్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు.