Home Tips

Mosquitoes : ఇలా చేస్తే చాలు.. మీ ఇంట్లో ఉన్న దోమలన్నీ పరార్‌.. మళ్లీ రావు..!

Mosquitoes : ప్రస్తుత తరుణంలో దోమల బెడద ఎలా ఉందో అందరికీ తెలిసిందే. దోమలు కుడుతుండడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే దోమల బాధ అయితే తప్పడం లేదు. ఈ క్రమంలోనే దోమలను నియంత్రించేందుకు చాలా మంది లిక్విడ్స్‌, కాయిల్స్‌, అగర్‌ బత్తీలు, క్రీమ్స్‌ వంటివి వాడుతున్నారు. అయినప్పటికీ దోమల సంఖ్య పెరుగుతుందే తప్ప.. దోమలను మాత్రం నియంత్రించలేకపోతున్నాం. అయితే ముందు చెప్పినవన్నీ కృత్రిమమైన పద్ధతులు. అందువల్ల వాటిని ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి సైతం హాని కలుగుతుంది. కనుక సహజసిద్ధమైన మార్గాలను పాటించాలి. అలాంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్‌ ఒకటని చెప్పవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల దోమలు కుట్టకుండా చూసుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ ట్రీ ఆయిల్‌లో ఉండే సమ్మేళనాలు దోమలను తరిమేస్తాయి. అందువల్ల దీన్ని శరీరంపై రాసుకుంటే చాలు.. ఒక్క దోమ కూడా మన దగ్గరకు రాదు. పైగా ఇది సహజసిద్ధమైంది కనుక మన శరీరానికి, ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. కనుక దీన్ని చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే నిర్భయంగా వాడవచ్చు. టీ ట్రీ ఆయిల్‌ మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దీన్ని కొని తెచ్చి రాత్రి పూట నిద్రకు ముందు శరీరానికి రాయాలి. చర్మం బయటకు కనిపించే భాగాల్లో దీన్ని రాయాలి. అంతే.. రాత్రంతా సుఖంగా నిద్రించవచ్చు. కరెంటు లేకపోయినా.. ఫ్యాన్‌ నడవకపోయినా సరే.. మనల్ని అయితే దోమలు కుట్టవు. దీంతో దోమల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది.

do like this to remove mosquitoes in your home

ఇక దోమలను నియంత్రించేందుకు మనకు మరో అద్భుతమైన చిట్కా కూడా పనిచేస్తుంది. అదేమిటంటే.. మీరు బిర్యానీ ఆకులను కూడా చూసి ఉంటారు. వీటిని బిర్యానీ, పులావ్‌ వంటి వాటిల్లో వేస్తారు. మసాలా కూరల్లోనూ వేస్తుంటారు. అయితే ఈ ఆకును ఒకదాన్ని తీసుకుని గదిలో వెలిగించి మంటను ఆర్పేయాలి. దీంతో దాని నుంచి పొగ వస్తుంది. దీన్ని గది అంతా విస్తరించేలా చూడాలి. ఆ సమయంలో తలుపులు, కిటికీలు అన్నీ మూసేయాలి. తరువాత గది నుంచి బయటకు వచ్చి అలాగే ఒక గంట పాటు ఉంచాలి. దీంతో ఈ ఆకు పొగ వాసన గది అంతటా విస్తరిస్తుంది. తరువాత తలుపులు, కిటికీలు తెరిచినా ఏమీ కాదు. దోమలు లోపలికి రాలేవు. దీంతో దోమల నుంచి రక్షణ లభిస్తుంది.

ఇలా ఈ రెండు చిట్కాలను పాటిస్తే దోమలను నియంత్రించవచ్చు. దీంతో విష జ్వరాలు, ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయి. దోమలను నియంత్రించడంలో టీ ట్రీ ఆయిల్‌తోపాటు బిర్యానీ ఆకు కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. కనుక కృత్రిమ పద్ధతులను పాటించే బదులు ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించని సహజసిద్ధమైన పద్ధతులను పాటించండి. దీంతో ఆరోగ్యానికి హాని కలగకుండా లాభాలు పొందవచ్చు. దోమలను తరిమేయవచ్చు.

Admin

Recent Posts