ఆధ్యాత్మికం

Lakshmi Devi : సాయంత్రం పూట ఈ తప్పులు చేస్తే.. లక్ష్మీ దేవికి కోపం వస్తుంది..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ధనం రావాలని కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో వాస్తు పండితులు చెప్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇలా చేయాలని వాస్తు పండితులు చెప్పడం జరిగింది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, ఏం చేయాలి..?, సాయంత్రం పూట ఏం చేయకూడదు అనేది చూద్దాం.

లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, తులసిని కచ్చితంగా పూజించాలి. సాయంత్రం పూట తులసి మొక్కని అస్సలు ముట్టుకోకూడదు. సాయంత్రం పూట తులసి మొక్కని ముట్టుకుంటే, పేదరికం కలుగుతుంది. అలానే, తులసి మొక్కకి సాయంత్రం పూట నీళ్లు పోయడం కూడా మంచిది కాదు. అలానే, సాయంత్రం కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే, నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది.

do not make these mistakes in the evening

సూర్యాస్తమయం తర్వాత, చెత్త ఊడవ‌డం అసలు మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట చెత్త ఊడవడం వలన సంతోషం తొలగిపోతుంది. అదృష్టం కూడా కలగదు. కాబట్టి ఈ పొరపాటు అసలు చేయకండి. సాయంత్రం సమయంలో శారీరకంగా కలవడం వంటి పనులు చేయడం కూడా మంచిది కాదు. అది కూడా దురదృష్టాన్ని తీసుకొస్తుంది.

సాయంత్రం పూట నిద్రపోవడం కూడా అసలు మంచిది కాదు. సాయంత్రం పూట నిద్రపోతే, ఆరోగ్యం కూడా పాడవుతుంది. తిన్న వెంటనే పాత్రలు శుభ్రం చేయకపోతే నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. తిన్న వెంటనే ప్లేట్ శుభ్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది. సూర్యాస్తమయం సమయంలో చదువుకోవడం కూడా మంచిది కాదు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts