సూర్యాస్తమయం అయిన తర్వాత చాలా మంది తెలియక, ఈ తప్పులను చేస్తూ ఉంటారు. కానీ సూర్యాస్తమయం తర్వాత అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికైనా ఈ వస్తువులను దానం చేశారంటే, కచ్చితంగా పాపం చుట్టుకుంటుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. చీకటి పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకూడదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చీకటి పడ్డాక ఇతరులకి పెరుగుని దానం చేయకండి. పెరుగు శుక్ర గ్రహానికి ప్రతీక. శుక్రుడు మన ఇంట్లో ధనాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడు. కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత పెరుగును ఎవరికి ఇవ్వకూడదు. తర్వాత ఉల్లిపాయలను, వెల్లుల్లిపాయలను కూడా చాలా మంది అడుగుతారు. అవి కూడా ఎప్పుడు ఎవరికీ దానం చేయకండి. కరివేపాకును కూడా సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఇవ్వకూడదు.
పాలని కూడా సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. పాలని సూర్య, చంద్రునికి ప్రత్యేకంగా భావిస్తారు. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకండి. సూర్యాస్తమయం అయ్యాక ఉప్పును కూడా ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఉప్పును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. పసుపు, కుంకుమ ని కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే మహాలక్ష్మి దేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.
ఇవి గుర్తు పెట్టుకుని ఈసారి ఎవరైనా చీకటి పడ్డాక, ఈ వస్తువుల్ని అడిగితే అస్సలు పొరపాటున కూడా ఇవ్వకండి. ఇచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ధాన్యం కూడా ఎవరికి ఇవ్వకూడదు. సాయంత్రం సంధ్య వేళలో దీపాన్ని వెలిగించడం. ఇల్లు చీకటిగా లేకుండా చూసుకోవడం వంటివి చేయండి. సాయంత్రం పూట తల దువ్వడం, పేలు చూసుకోవడం లాంటివి మాత్రం చెయ్యద్దు.